iPhone 13 : యాపిల్ సంస్థ తన ఐఫోన్ 13 మోడల్‌పై భారీ తగ్గింపు ధరను అందిస్తోంది. ఈ ఆఫర్ యాపిల్ ప్రీమియం రీసెల్లర్ స్టోర్స్‌తోపాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వల్ల ఐఫోన్ 13 కు చెందిన 128 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్‌ను రూ.8,400 తగ్గింపు ధరకు అందిస్తారు. అదే కస్టమర్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొంటే ఇంకో రూ.4వేల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మొత్తం రూ.12,400 డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ఐఫోన్ 13కి చెందిన 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర ప్రస్తుతం రూ.79,999గా ఉంది. ఆఫర్ వల్ల రూ.67,599 ధరకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఇక కస్టమర్లు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ సదుపాయాన్ని ఎంచుకుంటే మరింత డిస్కౌంట్ లభిస్తుంది. ఈ క్రమంలోనే గరిష్టంగా ఈ ఫోన్‌పై రూ.19వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ రూ.48,500 ధరకు లభిస్తుంది. అయితే ఇందుకు గాను కస్టమర్లు తమ ఐఫోన్ 12 ప్రొ లేదా ప్రొ మ్యాక్స్ ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఆఫర్ ద్వారా చాలా తక్కువ ధరకు ఐఫోన్ 13 ఫోన్‌ను పొందవచ్చు.
ఇక ఈ ఆఫర్‌కు గడువు ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేదు. కానీ పరిమిత కాలం వరకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగా కస్టమర్లు ఐఫోన్ 13కి చెందిన బ్లూ, గ్రీన్, రెడ్, వైట్, మిడ్‌నైట్, పింక్ కలర్ వేరియెంట్లలో దేన్నయినా కొనవచ్చు. దేన్ని కొన్నా ఆఫర్ వర్తిస్తుంది. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోఈ ఆఫర్ అందుబాటులో లేదు. యాపిల్ రీసెల్లర్స్ లేదా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనే ఐఫోన్‌ను ఇలా కొనాల్సి ఉంటుంది. కాగా అమెజాన్‌లో ఇదే ఫోన్ ధర ప్రస్తుతం రూ.69,990 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,209 ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…