Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖి చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకించి ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఎంత గొప్ప కమెడియన్ కైనా తనదైన శైలిలో పంచులు వేస్తూ నోరు మూయిస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడానికి కూడా వెనుకాడదు. ఆమె వేసే పంచులు, కౌంటర్లు అందరికీ తెలిసిందే. ఇటీవల శ్రీముఖి తన గ్లామర్ డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. తన హాట్ గ్లామర్ లుక్ తో ఇటు బుల్లితెర పైన అటూ ఇటూ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది శ్రీముఖి. ఇక శ్రీముఖి వేసే స్టెప్పులు చూసే వీక్షకులను మైమరచిపోయేలా చేస్తాయి. ప్రస్తుతం బుల్లితెరపై శ్రీముఖి ఈటీవీలో జాతి రత్నాలు షో, స్టార్ మాలో ఈవెంట్లు, మొన్నటి వరకు జీ తెలుగులో సరిగమప షోకు హోస్టింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.
ఇక ఇప్పుడు ఓటీటీ డ్యాన్స్ షోలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆహా కోసం ఓంకార్ డ్యాన్స్ ఐకాన్ అనే డ్యాన్స్ షోను స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ఈ షోలో ఓంకార్ తన డ్యాన్స్ ప్లస్ టీం కోసం డాన్స్ మాస్టర్ యశ్, శేఖర్ మాస్టర్‌ని తెచ్చుకున్నాడు. ఈ షోలో యశ్, మోనాల్, శ్రీముఖిలు మెంటర్లుగా ఉండటం జరుగుతుందట. ఇక ఇటీవల శ్రీముఖి మీద తాజాగా డ్యాన్స్ ఐకాన్ షోకి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. పుష్ప చిత్రంలో సమంత చేసిన ఊ అంటావా ఊ ఊ అంటావా అనే పాటకు శ్రీముఖి స్టేజ్ మీద స్టెప్పులు వేసి ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంది.

తన భారీ అందాలు కనిపించేలా శ్రీముఖి శేఖర్ మాస్టర్ తో కలిసి అదిరిపోయే మూమెంట్స్ వేస్తూ స్టేజిపై అదరగొట్టేసింది. అసలు వీరిద్దరి కాంబినేషన్ లో డాన్స్ స్టెప్పులకు సోషల్ మీడియా లో అదిరిపోయే ఫాలోయింగ్ వుంది. ఇలా ఇద్దరూ ఊ అంటావా మామ అనే పాటకు స్టెప్పులు వేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమం కోసం శ్రీముఖి పింక్ కలర్ అవుట్ ఫిట్ లో చూసేవారి మతులు పోగొట్టేలా హాట్ లుక్స్ తో లేటెస్ట్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.