Sreeleela : సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చిన కూడా కొంతమంది మాత్రమే అదృష్టం కలిసి వచ్చి స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇటీవల వచ్చిన హీరోయిన్స్ లో ఈ అదృష్టం శ్రీలీలాకి బాగా ఉన్నట్లు కనిపిస్తుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన సినిమా పెళ్లి సందD. ఈ సినిమా గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీలకి మాత్రం మంచి పేరు వచ్చింది. శ్రీలీల గతంలో కన్నడలో కూడా సినిమాలు చేయగా.. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత శ్రీలీల కొన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓకే ఒక సినిమాతో తన గ్లామర్ తో టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది.
ప్రస్తుతం శ్రీలీల రవితేజకు జంటగా ధమాకా చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం విడుదల కాకుండానే శ్రీలీలకు మరో భారీ ఆఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిందట ఈ బ్యూటీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబుకి జంటగా శ్రీలీలను ఎంపిక చేశారు అని టాక్ వినిపిస్తుంది. మహేష్ 28వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కథాంశం పరంగా సెకండ్ హీరోయిన్ ఉంటుందట. ఆ ఛాన్స్ త్రివిక్రమ్ శ్రీలీలకు ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీలీల సూపర్ స్టార్ పక్కన జతకట్టడం దాదాపు ఖాయమే అంటున్నారు సినీ ప్రముఖులు. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రం త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మహేష్ బాబు లుక్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది. అలాగే ఫస్ట్ టైం తన మూవీలో మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వచ్చే ఈ చిత్రాన్ని వేసవి బరిలో దించడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.