Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్య కాలంలో తన కుమార్తెలకు చెందిన ఫొటోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. గతంలో కల్యాణ్ దేవ్‌తో కలిసి ప్రతి పోస్టులోనూ ఈమె కనిపించేది. కానీ చాలా రోజులుగా వీరు వేర్వేరుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు కల్యాణ్ దేవ్ సినిమాలను గతంలో మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేసింది. కానీ ఇప్పుడు ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కల్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెర సాని అనే మూవీలు రిలీజ్ అయినట్లు కూడా ఎవరికీ తెలియదు.
ఇక తాజాగా శ్రీజ ఓ వాట్సాప్ చాట్‌ను బయట పెట్టింది. అందులో తన కుమార్తె నివృత్తితో ఆమె చాటింగ్ చేసింది. ఆమె తన తల్లి శ్రీజకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టగా.. దానికి శ్రీజ నవ్వుతూ రిప్లై ఇచ్చింది. అయితే ఆ ఎమోజీ తనకు నచ్చలేదని నివృత్తి చెప్పగా.. మేం పాత కాలం మనుషులం ఇంతే.. అని శ్రీజ రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ వాట్సాప్ చాట్‌ను శ్రీజ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే గత కొంత కాలంగా శ్రీజ తన కుమార్తెలు నివృత్తి, నవిష్కలను తన వద్దే పెంచుతోంది. ఈ మధ్యే నవిష్క బర్త్ డే కు కల్యాణ్ దేవ్ విషెస్ చెప్పాడు. కానీ నివృత్తి బర్త్ డేకు చెప్పలేదు. దీంతో శ్రీజ, కల్యాణ్ మధ్య ఏదో జరిగి ఉంటుందని.. కనుకనే వారు విడిగా ఉంటున్నారని అంటున్నారు. అయితే వీరు విడిగా ఉంటున్నారా.. లేక ఇప్పటికే విడాకులు తీసుకుంటున్నారా.. అన్న విషయాలను మాత్రం స్పష్టం చేయలేదు. కానీ దీనిపై త్వరలో ఏమైనా విషయాలు తెలుస్తాయేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…