Sreeja Konidela : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మధ్య కాలంలో ఈమె బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే గతంలో సమంత మాదిరిగానే ఈమె కూడా సందేశాత్మక పోస్ట్‌లను షేర్ చేస్తోంది. దీంతో నెటిజన్లు శ్రీజ కొటేషన్లలో ఉన్న గూడార్థాలను వెదికే పనిలో పడ్డారు. ఆమె ఎందుకు అలా కొటేషన్స్‌ను పోస్ట్ చేస్తుందో అర్థం కావడం లేదు. తన భర్త కల్యాణ్ దేవ్‌ను ఉద్దేశించే ఆమె ఆ పోస్ట్‌లు పెడుతుందని అంటున్నారు. ఇక తాజాగా శ్రీజ అలాంటిదే ఓ కోట్‌ను పోస్ట్ చేసింది.

ఇంతకీ శ్రీజ పోస్ట్ చేసిన కొటేషన్‌లో ఏముంది ? అంటే.. మనం ఎదుటి వారికి ఏదైతే ఇస్తామో.. ఏదైతే చేస్తామో.. తిరిగి అదే మనకు 100 రెట్లు ఎక్కువగా లభిస్తుంది.. అన్న కొటేషన్‌ను శ్రీజ షేర్ చేసింది. దీంతో ఆమె కొటేషన్‌లో ఉన్న ఇంకో అర్థాన్ని వెదుకుతున్నారు. తన భర్త కల్యాణ్ దేవ్ ను ఉద్దేశించే ఈ పోస్ట్ కూడా పెట్టిందని అంటున్నారు. శ్రీజ, కల్యాణ్ దేవ్‌లు మొన్నటి వరకు అన్యోన్యంగానే ఉన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. శ్రీజ తన భర్త కల్యాణ్ పేరును తొలగించి తన పేరు పక్కన కొణిదెల అని పుట్టింటి ఇంటి పేరును జత చేసింది. దీంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈమె కూడా సమంత లాగే పేరు మార్చడంతో ఆమె చేసిన విధంగానే శ్రీజ కూడా భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు గుప్పుమన్నాయి.
అయితే మెగా ఫ్యామిలీ మాత్రం శ్రీజ, కల్యాణ్ దేవ్‌ల విడాకుల వార్తలపై స్పందించలేదు. కనీసం ఖండించలేదు. కానీ ఇప్పటికీ ఈ విషయం తెరపైకి వస్తూనే ఉంది. ఇక ఈ ఇద్దరు దంపతులూ గతంలో ఎప్పుడూ కలిసే కనిపించేవారు. ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరొకరి పోస్టులు కనిపించేవి. వీరు కలిసే ఉండేవారు. కానీ ఇప్పుడలా కనిపించడం లేదు. దీంతో రోజు రోజుకీ శ్రీజ, కల్యాణ్ దేవ్‌ల విడాకుల విషయమై అనుమానాలు బలపడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.