Squid Game : స్క్విడ్ గేమ్.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈ వెబ్ సిరీస్‌ను చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిత్యం ఈ సిరీస్‌కు చెందిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే.. ఇంతకీ.. ఏంటీ.. స్క్విడ్ గేమ్ సిరీస్. అంతగా ఇందులో ఏముంది ? అసలు ఇందులో కథ ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్క్విడ్ గేమ్.. వెబ్ సిరీస్‌ను దక్షిణ కొరియాలో నిర్మించారు. ఆ దేశం వారిదే కనుక భాష కూడా కొరియన్ ఉంటుంది. కనుక ఇతర ప్రేక్షకులకు అర్థం కాదు. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కనుక ఇంగ్లిష్ అర్థమయ్యేవారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక అసలు కథ విషయానికి వస్తే..
ఉద్యోగం కోల్పోయి.. ఎక్కడా పని దొరక్క.. భారీగా అప్పులు చేసి తీవ్రమైన ఆర్థిక సమస్యలలో ఉన్న హీరో.. తల్లి తెచ్చే డబ్బులపై ఆధార పడి బతుకుంటాడు. అక్కడితో ఆగితే బెటరే. కానీ అతనికి గుర్రపు పందాలు అంటే మోజు. దీంతో తల్లి పాకెట్ మనీకి ఇచ్చే డబ్బులతోపాటు ఆమె ఇంట్లో దాచి పెట్టిన డబ్బును వెతికి మరీ గుర్రపు పందాలు కాస్తుంటాడు. ఈ క్రమంలో అప్పులు మరింత ఎక్కువవుతుంటాయి. కానీ వాటి నుంచి బయట పడే మార్గం చేయడు. మరోవైపు అతను ఈ విధంగా చేస్తున్నాడని.. అతని భార్య అతనికి విడాకులు ఇచ్చి తమ కుమార్తెతో వేరేగా ఉంటుంది. ఆమె ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో కలిసి అమెరికా వెళ్లే ప్లాన్ చేస్తుంటుంది.
ఇక హీరోలాగే డబ్బు కష్టాలు ఉండే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారందరినీ ఒక దీవిలో చిన్న పిల్లల గేమ్స్ ఆడిస్తారు. సాధారణంగా అయితే ఆ ఆటల్లో ఔట్ అయిన వారు పక్కకు తప్పుకోవాలి. కానీ కొందరు బడాబాబులు ఆడించే ఆ చిన్న పిల్లల ఆటల్లో ఔట్ అయితే చనిపోవాల్సిందే. నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తారు. అలా వారు మొత్తం 6 గేమ్స్‌ను ఆడిస్తారు.
గేమ్స్ అన్నీ చిన్న పిల్లలు ఆడుకునేవే అయినప్పటికీ.. అందులో హార్రర్‌ను చొప్పించారు. ఆటలో ఔట్ అయితే పక్కకు తప్పుకోవాలి. కానీ అక్కడ ఆడే ఆటలో చనిపోవాలి. ఎలిమినేట్ అయిన వారు చనిపోతారు. వారిని కాల్చి చంపేస్తారు. ఇది ఆ ఆటలో ప్రాథమిక రూల్. ఇక మొత్తం 6 ఆటలు ఆడిస్తారు. 6 రోజుల పాటు ఆటలు ఆడాలి. మొత్తం 456 మంది పాల్గొంటారు. 456 నంబర్ హీరోది. వారిని ఓ దీవికి మత్తులో ఉంచి తీసుకెళ్తారు. ఆ దీవి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.
అలా ఆ దీవిలో అన్ని గేమ్స్‌ను ఆడి గెలిచిన వారు విజేత అయినట్లు లెక్క. వారికి కొన్ని కోట్ల రూపాయల సొమ్ము వస్తుంది. స్క్విడ్ గేమ్ కథ ఇదే.
అయితే 456 మంది ఆడిన గేమ్‌లో ఎంత మంది మిగిలారు ? ఏం జరిగింది ? గేమ్‌లను ఎలా ఆడారు ? హీరో ఎలా విజయం సాధించాడు ? చివరకు ఏమవుతుంది ? అసలు చిన్న పిల్లల గేమ్స్ పేరు చెప్పి డబ్బు కష్టాల్లో ఉన్న వారిని తెచ్చి వారిచే గేమ్స్ ఆడించి ఓడిన వాళ్లను ఎందుకు కాల్చి చంపేస్తారు ? దీని వెనుక అసలు సూత్రధారి ఎవరు ? ఎందుకలా చేశారు ? వంటి వివరాలన్నింటినీ తెలుసుకోవాలంటే.. ఈ సిరీస్‌ను చూడాల్సిందే.
నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ స్క్విడ్ గేమ్ సిరీస్‌ను ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు. అయితే ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను 9 భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నట్లు చెప్పింది. అంటే.. కొంతకాలం ఓపికపడితే దీన్ని తెలుగులోనూ చూడవచ్చన్నమాట. అంతవరకు ఆగలేం.. సస్పెన్స్‌గా ఉంది.. అనుకున్న వారు వెంటనే ఈ సిరీస్ ను చూడవచ్చు. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకటే సీజన్. రెండో సీజన్‌పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సో.. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హార్రర్ సిరీస్‌ను ఎంజాయ్ చేయాలంటే.. స్క్విడ్ గేమ్ సిరీస్‌ను చూడాల్సిందే. ఒక్కో ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగుతూ థ్రిల్‌ను కలగజేస్తుంది. ఇక చివరిగా ఇంకో మాట.. మధ్య మధ్యలో ఒకటి రెండు చోట్ల కొన్ని సన్నివేశాలు వస్తాయి. కనుక ఈ సిరీస్ ను ఫోన్‌లోనో, లేదా ఇంట్లో టీవీలో అయితే ఎవరూ లేనప్పుడో చూడడం బెటర్. అది ఫ్యామిలీ ఉన్నవాళ్లకు. లేని వాళ్లు ఎలాగైనా చూసేయండి..!
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…