Squid Game : కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈ సమయంలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రపంచమంతటా వ్యాపించింది. ఎంటర్ టైన్ మెంట్ లో ఓటీటీలు సంచలనాన్ని క్రియేట్ చేశాయి. అలా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజై యావత్ ప్రపంచాన్నే ఊర్రూతలూగించిన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గురించి స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. ఈ వెబ్ సిరీస్ ను తెలుగులోకి అనువదిస్తున్నారు.
ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలిపింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ను తెలుగు, తమిళం, హిందీ భాషల్లోకి ట్రాన్సలేట్ చేస్తున్నారు. డబ్బింగ్ కు సంబంధించిన పనులు పూర్తయ్యాక రిలీజ్ డేట్స్ ని రివీల్ చేస్తారట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ లో అన్ని డైలాగ్స్ అర్థం కాక మిస్ అవుతున్నామనుకునేవారు తెలుగు, తమిళం, హిందీలోకి అనువదించడం సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో గతంలో వచ్చిన మనీ హేస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇంతే హైప్ ని క్రియేట్ చేసింది. సైంటిఫికల్ సైన్స్ ఫిక్షన్ తో తెకకెక్కిన ఈ సిరీస్ ను కూడా ఫస్ట్ ఒరిజినల్ భాషలో కిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ భాషల్లోకి ట్రాన్సలేట్ చేశాక.. అభిమానులకు మరింత చేరువైంది. ఇప్పుడు స్క్విడ్ గేమ్ ను కూడా అదే తరహాలో తెలుగుతోపాటు మరిన్ని భాషల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ వార్త ఓటీటీ ప్రియులకు సంతోషాన్నిస్తోందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…