Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ సమంత.. తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక.. తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత తమిళ దర్శకులతో రెండు ద్విభాషా సినిమాలను ఒప్పుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ నిర్ణయంపై అటు దర్శకులతోపాటు ఇటు సామ్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సమంత ఈ సినిమాతో ఫస్ట్ స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేస్తోంది. అలాగే ఆమె కెరీర్ ని ఫుల్ బిజీగా మార్చుకోవడానికి మలయాళం సినిమా కూడా ఒప్పుకుంది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కి హీరోయిన్ సమంత యశోద అనే సినిమాకి డేట్స్ ఇచ్చారట. ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజ్ తరహాలోనే ఉంటుందని అంటున్నారు. ఇక సామ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమె అభిమానులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఎందుకంటే తమిళ సినిమాలంటే కొంతవరకు అర్థమవుతాయి గానీ మలయాళం అంటే బహుశా కష్టం అని అనుకుంటున్నారట. సమంత హీరోయిన్ గా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఉన్ని ముకుందన్ యాక్ట్ చేశారు. అలాంటి నటుడి పక్కన సామ్ యాక్ట్ చేయడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అతనికి అంత స్టార్ డమ్ లేదు కనుక సమంత అతని పక్కన చేయడం ఏంటి ? అనుకుంటున్నారట. ఈ విషయంలోనే ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా సామ్ మాత్రం తన కెరీర్ ని ఇండియా వైడ్ గా ఫోకస్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో సమంత బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…