Speed Breaker : మన దేశంలో రోడ్లు అంటే.. అంతే.. ఒక్కో చోట అద్దం లాంటి రోడ్లు ఉంటాయి. ఇంకొన్ని చోట్ల అసలు రోడ్లే ఉండవు. కొన్ని చోట్ల రోడ్లు మనకు గుంతలతో దర్శనమిస్తాయి. ఇలా ఒక్కో చోట రోడ్లు ఒక్కో విధంగా ఉంటాయి. ఇక కొన్ని రహదారులపై అయితే భారీ ఎత్తున స్పీడ్ బ్రేకర్‌లను నిర్మిస్తుంటారు. ఒక పద్ధతి, కొలత లేకుండానే ఇష్టానుసారంగా స్పీడ్ బ్రేకర్లను వేస్తుంటారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడడమో లేదా ఇంకేదైనా జరగడమో సంభవిస్తుంటాయి. సరిగ్గా ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అభిషేక్ వర్మ తనకు ఇటీవల అక్కడి ఓ రోడ్డుపై ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా వివరించాడు. తాను ఈ మధ్యే కొన్న కొత్త కియా సెల్టోస్ కారు సిటీలో ఓ చోట స్పీడ్ బ్రేకర్‌పై స్టక్ అయి నిలిచిపోయిందన్నాడు. సదరు కారుకు గ్రౌండ్ క్లియరెన్స్ 190 ఎంఎం ఉంది. అయినప్పటికీ స్పీడ్ బ్రేకర్ మరీ పెద్దగా ఎత్తుగా ఉంది. దీంతో కారు స్పీడ్ బ్రేకర్ మీదకు వచ్చి అలాగే నిలిచిపోయింది. వెనక్కి ముందుకు కదలలేకపోయింది.
అయితే కొన్ని గంటల పాటు తాను అలాగే ఉండాల్సి వచ్చిందని.. తరువాత ఒక ట్రక్ సహాయంతో కారును పైకెత్తి అలాగే తీసుకుని వెళ్లానని చెప్పాడు. సదరు స్పీడ్ బ్రేకర్ గనక చిన్నగా ఉండి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వాపోయాడు. తలకాయ లేకుండా మైండ్ లేని విధంగా ఆ స్పీడ్ బ్రేకర్‌ను నిర్మించారని, అసలు స్పీడ్ బ్రేకర్ ఎక్కడైనా అంత ఎత్తుగా ఉంటుందా.. అని ప్రశ్నించాడు. అయితే దీనికి సంబంధిత శాఖ అధికారులెవరూ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…