Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించడంలో మాజీ మంత్రి కొడాలి నాని ఒక స్టెప్ ఎల్లప్పుడూ ముందే ఉంటారు. చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్‌పై కూడా కొడాలి నాని విరుచుకుపడుతుంటారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై మరోమారు నాని మండిపడ్డారు. గుడివాడలోని బొమ్మలూరు వద్ద ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నీలం, ఆకుపచ్చ రంగులను వేసేందుకు యత్నించారు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు ఎన్‌టీఆర్ విగ్రహానికి పసుపు రంగు వేశారు. అనంతరం మాట్లాడుతూ కొడాలి నాని తన రాజకీయ అవసరాల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
అయితే ఈ విషయంపై నాని స్పందించారు. ఎన్‌టీఆర్ అసలు టీడీపీకి చెందిన వారు కారని.. చంద్రబాబు గతంలోనే ఈ విషయంపై ఎన్నికల సంఘానికి అఫిడవిట్‌లో తెలియజేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఎన్‌టీఆర్ తమ మనిషని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే అని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఎన్‌టీఆర్ ఫొటోలను పార్టీ ఆఫీసుల నుంచి తీయించారని.. అలాంటి వారు ఇలా ప్రవర్తించడం హాస్యాస్పదం కాక మరేమిటని అన్నారు.
చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నాడని.. ఆయన చరిత్ర అందరికీ తెలుసని కొడాలి నాని అన్నారు. 1995లో ఎన్‌టీఆర్ నుంచి సీఎం పీఠాన్ని లాక్కుని ఆయన చావుకు ఎవరు కారణమయ్యారో అందరికీ తెలుసని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…