Sonu Sood : కష్టాల్లో, పేదరికంలో ఉన్న వాళ్లకు మొదట గుర్తుకు వచ్చే పేరు సోనూ సూద్. కరోనా వైరస్ ఉపద్రవం వచ్చినప్పటి నుండి ఈయన జాతీయ స్థాయిలో సమాజ సేవకి మారుపేరుగా గుర్తింపు పొందారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస జీవులను వాళ్ల సొంత ఊళ్లకు చేర్చడంతో మొదలైన ఆయన సేవలు.. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం.. వారి ఆకలి తీర్చడం, హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత తీర్చడం.. ఇలా ఎన్నో విధాలుగా కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకున్నారు. దీని కోసం ఆయన తన సొంత డబ్బుని ఎంతో ఖర్చు చేశారు.
అయితే ఇప్పటికీ రకరకాల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు వందల మంది ప్రతి రోజూ ఆయన ఇంటిముందు ఎదురు చూస్తూ ఉంటున్నారు. తమ సమస్యలను ఆయనతో చెప్పుకొని ఆ కష్టాల నుండి తమని బయట పడేయడానికి సాయం చేయమని అడుగుతుంటారు. ఇలాగే అలాంటి వాళ్లందరూ సోనూ సూద్ ఇంటి ముందు సాయం కోసం క్యూలో నిలబడిన వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక ఇదే విషయంలో సోనూ సూద్ ఒక ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఇది తనకు అలవాటై పోయిందని.. ఇలా వారానికి 5 రోజులు ప్రతి రోజూ150 నుండి 200 మంది ప్రజలు సాయం కోసం వస్తారని, ఇక వారాంతాల్లో అయితే 500 నుండి 700 మంది వరకు వస్తారని అన్నారు. ఇదే విధంగా సోషల్ మీడియా ద్వారా రోజూ 30వేల నుండి 40వేల వరకు అభ్యర్థనలు వస్తాయని వివరించారు.
ఇలా ప్రతి రోజూ తన ఇంటి ముందు జనం పోగవడం వల్ల భద్రతా పరమైన సమస్యలు వచ్చే అవకాశం లేదా అని ఛానల్ ప్రతినిధి అడగ్గా.. అలాంటిదేం లేదని, నిజానికి ఆ సొసైటీలోని చుట్టు పక్కల నివాసం ఉండే వారు చాలా సహకరిస్తారని, వాళ్లు కూడా అప్పుడప్పుడూ సాయం కోసం తనని సంప్రదిస్తారని, ఇక్కడ సహాయం కోసం వచ్చిన వారు ఖాళీ చేతులతో వెళ్లరని వారికి కూడా తెలుసని.. చెప్పారు.
అయితే.. ఇలా లెక్కలేనన్ని వినతులు రావడం వల్ల మీకు మానసిక ఒత్తిడి లాంటివి కలగవా అని ప్రశ్నించగా.. దానికి సోనూసూద్ అలా ఎప్పుడూ అనిపించలేదని.. ఒక విధంగా ఇదంతా సమాజం పట్ల, సమస్యల్లో ఉన్నవారి పట్ల తన భాధ్యతను మరింత పెంచుతుందని, ఇంకా పెద్ద ఎత్తున సేవ చేయడానికి స్ఫూర్తిని ఇస్తుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే సోనూ సూద్ చేసిన ఈ కామెంట్స్‌కు అందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…