Meena : ఇటీవల భర్తను కోల్పోయారు సీనియర్ హీరోయిన్ మీనా. భర్త మరణం తర్వాత కొన్నాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు. ఈమధ్యే మళ్ళీ సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఉన్న ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్న మీనా.. ఆ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆమెకు ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రంభ, సంఘవి, సంగీత లాంటి స్టార్స్ ఫ్యామిలీస్ తో కలిసి మీనా ఇంటికి వెళ్లారు. అక్కడ సందడి చేశారు. ఆ ఫోటోస్ ను కూడా మీనా షేర్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే బాధల నుంచి బయట పడుతున్న మీనా.. ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.. దీనికి సంబంధించి తాజాగా ఓ పోస్ట్ పెట్టారు.
మనుషుల ప్రాణాలను కాపాడడం కంటే గొప్ప పని, సాయం ఇంకోటి ఉండదు. అలా ఒకరి ప్రాణాలను కాపాడటంలో ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. అదొక వరం.. మా సాగర్ కు ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే.. ఆయన ఇంకా బతికే వారు.. నా జీవితం ఇంకోలా ఉండేది.. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు.
అవయవ దానం గొప్పదనం గురించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా అవయవాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను. వాటిని అంతకంటే గొప్పగా ముందుకు తీసుకెళ్లే మార్గం మరొకటి లేదు అంటూ ఎమోషనల్ అయింది. ఈ నిర్ణయంతో నెటిజన్లు అందరూ మీనాను శభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆమెను అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…