Sonu Sood : సోనూ సూద్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో విలన్ పాత్రల్లో భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో మాత్రం ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఎందరికో సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరును చూసి తెరపై ఆయనను చూసి భయపడ్డవారే ఆనందంతో అభినందనలు తెలిపారు. రీల్ పై విలన్.. రియల్ లైఫ్ లో హీరో అంటూ కొనియాడారు.
ప్రజలకు నిత్యం సాయం చేసేందుకు సూద్ ఛారిటీని కూడా నెలకొల్పారు. సోనూ మంచి మనసు చూసి, ఆయన ఛారిటీకి కొందరు దాతలు విరాళాలు ఇచ్చారు. సోనూ సూద్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో ఆయన హీరోగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అంగీకరించిన చిత్రాలు పూర్తయిన తరువాత సోనూ సూద్ హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తారేమో చూడాలి. సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సోనూ సూద్ ఓ వీడియోను షేర్ చేశాడు.

అందులో సోనూ సూద్ ఎస్కలేటర్‌ను వింతగా వాడేశాడు. ఎస్కలేటర్‌లో ఎలా నిలబడతారు.. ఎలా కిందకు వస్తారో.. ఎలా దిగుతారో అందరికీ తెలిసిందే. కానీ సోనూ సూద్ మాత్రం కాళ్ల మీద నిలబడ లేదు. చేతుల మీద బ్యాలెన్స్ చేసుకున్నాడు. కాళ్లను గాలిలోనే ఉంచాడు. ఇక చివర్లో చిన్నగా జంప్ చేసేశాడు. మొత్తానికి సోనూ సూద్ తనలోని చిన్న పిల్లాడిని ఇలా బయటకు తీశాడు. అది చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అరెరే.. ఎస్కలేటర్ ఇలా కూడా దిగుతారు అని తెలీక మేము మాములుగా దిగాము అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Something..I can’t resist ❤️🙏 pic.twitter.com/NTyMcruBaE
— sonu sood (@SonuSood) September 2, 2022