Sonu Sood : నటుడు సోనూ సూద్.. ఈయన కరోనాకు ముందు వరకు సినిమాల్లో విలన్. ఆ విధంగానే ప్రేక్షకులకు పరిచయం. కానీ కరోనా నుంచి ఈయన రియల్ లైఫ్ హీరో అయ్యారు. ఈయనను ఎంతో మంది అభిమానిస్తున్నారు. కారణం.. కరోనా సమయంలో ఈయన చేసిన సేవలే అని చెప్పవచ్చు. ఎంతో మంది వలస కూలీలను తమ సొంత ఊళ్లకు తరలించి వారి ప్రాణాలు కాపాడాడు. అలాగే కోవిడ్ రెండో వేవ్ సమయంలో దేశమంతటా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించి బాధితులకు ఆక్సిజన్ అందేలా చేశాడు. ఇక ఇప్పటికీ ఈయన ఎంతో మందిని ఆదుకుంటూనే ఉన్నారు. అవసరం అయిన వారికి సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే సోనూసూద్‌ను సినిమాల్లో విలన్‌గా చూసేందుకు మాత్రం ఇప్పుడు ఎవరూ ఇష్టపడడం లేదు.
ఇక సోనూసూద్‌కు గతంలో విలన్ పాత్రలే ఎక్కువగా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయనకు ఉండే అభిమానుల సంఖ్య పెరిగింది. దీంతో వారి కోరిక మేరకు సోనూసూద్‌కు పాజిటివ్ క్యారెక్టర్లనే ఇస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీల పరంగా సోనూసూద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బాలీవుడ్‌లో ఎప్పుడూ విలన్ రోల్స్‌నే ఇచ్చారని.. కానీ దక్షిణాది చిత్ర పరిశ్రమ అలా కాదని.. వారు తనను అక్కున చేర్చుకున్నారని సోనూసూద్ అన్నాడు.

దక్షిణాది చిత్రాల్లో నటించే చాన్స్‌లు రాబట్టే తాను బాలీవుడ్‌లో విలన్ పాత్రలు చేసేందుకు అంగీకరించలేదని అన్నాడు. దీంతో సోనూ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన అన్నదాన్ని బట్టి చూస్తే బాలీవుడ్ లో ఆయనకు సరైన గౌరవం దక్కలేదని తెలుస్తోంది. అయితే దక్షిణాది చిత్రాల్లోనూ చాలా వరకు ఆయన విలన్ పాత్రలనే చేశారు. ఏదో ఒకటి రెండు సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్లు చేశారు. కానీ బాలీవుడ్‌లో అలాంటి క్యారెక్టర్లు కూడా రాలేదని సోనూసూద్ మాటలను బట్టి చెప్పవచ్చు. అయితే ఇకపై ఆయనకు ఎలాంటి రోల్స్‌ను ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.