Sonu Sood : కరోనా మొదటి వేవ్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో మంది వలస కార్మికులకు సహాయం అందించిన విషయం విదితమే. ఆయన ఎంతో మందిని సొంత ఊళ్లకు వెళ్లేలా చేశారు. అలాగే రెండో వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ఇప్పటికీ ఆయన తన వద్దకు వచ్చే వారికి కాదు, లేదు.. అనకుండా సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సోనూసూద్ ఓ యువకుడి ప్రాణాలు కాపాడి అందరిచే మరోమారు ప్రశంసలను అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌లోని మోగా అనే ప్రాంతంలో రాత్రి పూట ఓ యువకుడు (19) తీవ్రమైన ప్రమాదానికి గురయ్యాడు. ఫ్లై ఓవర్ కింద అతని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు నుజ్జు నుజ్జయింది. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న సోనూసూద్ వెంటనే స్పందించారు. యాక్సిడెంట్ అయిన కారు వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఆ కారుకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. దీంతో అందులో చిక్కుకుపోయిన ఆ యువకుడిని బయటకు తీసేందుకు కొంత సమయం పట్టింది. అయినప్పటికీ సోనూసూద్ బాగా శ్రమించి ఎట్టకేలకు ఆ యువకున్ని బయటకు తీయించారు. అనంతరం వెంటనే ఆ యువకుడిని సమీపంలో ఉన్న హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం బాగానే ఉందని, అతనికి చికిత్సను అందిస్తున్నామని, అతను కోలుకుంటున్నాడని.. వైద్యులు తెలిపారు. అయితే సమయానికి సోనూసూద్ హాస్పిటల్ కు ఆ యువకున్ని తీసుకు రావడం వల్లే అతను ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడ్డని వైద్యులు తెలిపారు. దీంతో సోనూసూద్‌ను మరోమారు అందరూ అభినందిస్తున్నారు. దేవుడిలా వచ్చి కాపాడాడంటూ కొనియాడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…