Sonu Sood : భారతదేశంలో ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు.. సోనూసూద్.. కరోనా కష్టకాలం నుంచి ఇప్పటి వరకు సోనూసూద్ సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాడు. కరోనా సమయంలో ఎంతో మంది పేదలను, వలస కూలీలను వారి వారి సొంత గ్రామాలకు చేర్చాడు. ఇక కరోనా రెండో వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా అనేక మందికి వైద్య సదుపాయాలను.. ముఖ్యంగా ఆక్సిజన్‌ను అందజేశాడు.
తన వద్దకు ఎవరైనా సహాయం చేయమని వస్తే.. కాదు, లేదు అనకుండా సోనూసూద్ ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నాడు. ఇక ఆయన సోదరి ఇటీవలే రాజకీయాల్లో ప్రవేశం చేశారు. సోనూసూద్ సోదరి మాళవిక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే సోనూసూద్‌ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఇప్పటి వరకు ఎంతో మంది ఆహ్వానించారు. కానీ రాజకీయాలపై సోనూ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు.
మరో ఐదు సంవత్సరాల పాటు సమాజ సేవ చేసి ఆ తరువాత రాజకీయాలలోకి వస్తానని సోనూసూద్ తెలిపారు. అయితే ఎప్పుడైతే ఈ పదవికి తాను అర్హుడినని అందరూ అంటారో అలాంటి సమయంలో తాను రాజకీయాలలోకి వస్తానని తెలిపారు.
ఇక తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలోనే చేరుతానని ఈ సందర్భంగా సోనుసూద్ తెలియజేశారు. కాగా ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోనూసూద్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన సోదరి మాళవికకు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలపై స్పందించిన సోనూసూద్ పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…