Sonam Kapoor : ఈ మధ్య కాలంలో బేబీ బంప్ లతో ఫొటో షూట్స్ చేయడం కామన్‌గా మారింది. గత కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌తో తెగ ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో సోనమ్ కపూర్ చేరింది. అనిల్ కపూర్ గారాల పట్టిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోనమ్ కపూర్ బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలతో కలసి రొమాన్స్ చేసింది. 2018లో సోనమ్ కపూర్ వ్యాపార వేత్త ఆనంద్ అహుజాని వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన భర్త అనంద్ ఆహుజాతో కలిసి తన ప్రగ్నెన్సీని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన తాజా బేబీ బంప్ ఫొటోషూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనమ్.

తాజాగా ఈ ముద్దుగుమ్మ అబుజానీ బర్త్‌డే పార్టీలో సందడి చేయగా, ఆ సమయంలో ధరించిన ట్రెండీ వేర్ దుస్తులలో ఫొటో షూట్ చేసింది. బేబీ బంప్‌తో సోనమ్ కపూర్ స్టన్నింగ్ లుక్స్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. సోనమ్ ధరించిన చీరను తన సోదరి రియా కపూర్ డిజైన్ చేసినట్లు ఆమె పేర్కొంది. కాగా సోనమ్ కపూర్‌ను బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అని పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. సినిమా ఈవెంట్స్‌కు, అవార్డు ఫంక్షన్స్ కు ఆమె స్టైలిష్, డిఫరెంట్ ఫ్యాషన్ వేర్ దుస్తులు ధరించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంది.
దాదాపు మూడేళ్ళ తర్వాత సోనమ్ కపూర్, ఆనంద్ దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ గర్భవతి. త్వరలో ఆనంద్, సోనమ్ తల్లి దండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని సోనమ్, ఆనంద్ ఎంతో బ్యూటిఫుల్ గా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నిన్ను పెంచడానికి అన్నీ మా నాలుగు చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రతిధ్వనించే రెండు హృదయాలు ఉన్నాయి. నీపై ప్రేమాభిమానాలు కురిపించే ఒక ఫ్యామిలీ ఉంది. నీకోసం ఎదురుచూస్తున్నాం.. అంటూ సోనమ్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ లో తాను గర్భవతి అయిన విషయాన్ని ప్రకటించింది. భర్త ఒడిలో పడుకుని గర్భంపై చేతులు పెట్టుకుని ఉన్న అందమైన పిక్స్ ని సోనమ్ కపూర్ షేర్ చేసింది. కాగా.. కొంత కాలంగా సోనమ్ సినిమాలకు దూరంగా ఉంటోంది.