Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పలు కళలలో ప్రావీణ్యతను సంపాదించి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. ఈ మధ్యే గుర్రపు స్వారీ చేసిన సితార ఆ వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక డ్యాన్స్‌లో సరేసరి. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ అనే సాంగ్‌లో ఈమె డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అలాగే కళావతి పాటకు కూడా సితార స్టెప్పులేసింది. ఇక శ్రీరామ నవమి సందర్భంగా సంప్రదాయ వస్త్రాలను ధరించి కూచిపూడి నృత్యం చేసి అలరించింది.
ఇలా మహేష్ కుమార్తె పలు భిన్నమైన కళల్లో నైపుణ్యతను సాధించింది. తాత కృష్ణ, తండ్రి మహేష్‌లాగే సితార గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. అయితే భవిష్యత్తులో ఈమె హీరోయిన్‌గా రాణిస్తుందా.. అందుకనే ఈమె యాక్టింగ్, డ్యాన్స్, గుర్రపు స్వారీ వంటి కళలను నేర్చుకుంటుందా.. అని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈమె పెన్నీ సాంగ్ ద్వారా ఇప్పటికే తెరంగేట్రం చేసిందని చెప్పవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఒక చిత్రంలో నటించేందుకు కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక సితార ఈమధ్యే ఓ పాపులర్ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో ఆమె గతంలో తాను చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంది. తన డ్యాన్స్‌ను తాత కృష్ణ, సోదరుడు గౌతమ్ కృష్ణ చూశారా.. చూస్తే ఎలా ఉందని చెప్పారు.. వంటి ప్రశ్నలను యాంకర్ అడిగింది. దీంతో సితార తన తాత తన డ్యాన్స్‌ను చూసి మెచ్చుకున్నారని చెప్పింది. అయితే సోదరుడు మాత్రం మొదట ఏమీ చెప్పలేదని.. తరువాత బాగానే ఉందని అన్నాడని.. తెలియజేసింది. కాగా సితారకు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…