Ante Sundaraniki Review : వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుని సినిమాలు తీస్తాడని నాచురల్ స్టార్ నానికి పేరుంది. ఆయన తీసే ఒక్కో చిత్రానికి, ఇంకో చిత్రానికి అసలు సంబంధం ఉండదు. పూర్తిగా భిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అంటే సుందరానికి పేరిట ఓ భిన్నమైన కథతో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నానికి జోడిగా నజ్రియా నటించింది. ఈ క్రమంలోనే శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది.. నాని మరోసారి ప్రేక్షకులను మెప్పించాడా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
సుందర్ (నాని), లీల (నజ్రియా) ఇద్దరు చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితులు. వీరికి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉంటుంది. అయితే వీరివి భిన్నమైన మతాలు. చిన్నప్పటి నుంచే లీల అంటే సుందర్ విపరీతమైన ప్రేమను పెంచుకుంటాడు. అయితే ఆ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు భయపడుతుంటాడు. చివరకు వారు యుక్త వయస్సుకు వచ్చాక ప్రేమలో పడతారు. కానీ ఆ విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పేందుకు భయపడుతుంటారు. ముఖ్యంగా సుందర్‌ది బ్రాహ్మణ కుటుంబం కావడం, అతని తండ్రి (నరేష్) సంప్రదాయాలు, ఆచారాలకే ఎక్కువ విలువనిస్తుండడంతో.. సుందర్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడతాడు. అయితే చివరకు ఏమవుతుంది ? ఇరు కుటుంబాలను వారు ఒప్పించి పెళ్లి చేసుకుంటారా ? వారి ప్రేమ కథ సుఖాంతం అవుతుందా ? అన్న విషయాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఈ మూవీని నాని తన భుజ స్కంధాలపై నడిపించాడని చెప్పవచ్చు. నాచురల్ స్టార్ అన్న బిరుదు ఊరికే రాలేదు. సంప్రదాయ బ్రాహ్మణ యువకుడిగా నాని ఇందులో అద్భుతంగా నటించాడు. ఓ వైపు తమ ఆచారాలు, వ్యవహారాలు, వాటిని పాటిస్తూ ఇబ్బందులు పడే యువకుడిగా నాని ఇందులో కనిపించాడు. ఇక నజ్రియా కూడా తన నటనతో ఆకట్టుకుంది. చాలా చోట్ల ఆమె నటన సహజసిద్ధంగా అనిపిస్తుంది. నాచురల్ స్టార్ నాని అయినప్పటికీ నజ్రియా కూడా అలాగే నటించిందని చెప్పవచ్చు.
ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ ఒక సూక్ష్మమైన పాయింట్‌ను తీసుకుని దాని చుట్టూ కథ అల్లి మూవీని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. గతంలో ఈయన మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా.. చిత్రాలను తీశారు. అందువల్ల అంటే సుందరానికి లాంటి చిత్రాన్ని తీయడం ఆయనకు పెద్దగా కష్టం అయి ఉండకపోవచ్చు. కానీ సినిమా ఆద్యంతం ఆయన తీసుకున్న జాగ్రత్తలు.. సీన్లను తీసిన విధానం.. స్పష్టంగా కనిపిస్తాయి. దర్శకుడి ప్రతిభ కూడా ఈ మూవీలో కనిపిస్తుంది.
ఇక నరేష్, నదియా, రోహిని, అళగం పెరుమాల్‌లు కూడా తమ పాత్రల పరిధుల మేర అద్భుతంగా నటించారు. అయితే వీరిలో నరేష్‌కు ఎక్కువ సీన్లు వచ్చాయి. అలాగే అనుపమ పరమేశ్వరన్ చిన్న రోల్‌లో చేసి అలరించింది. హర్షవర్ధన్‌ను కూడా సరిగ్గానే ఉపయోగించుకున్నారు. రాహుల్ రామకృష్ణ ఒక సీన్‌లో వచ్చి వెళ్తాడు. మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే గుర్తుండిపోయే పాటలు ఏవీ లేవు. కానీ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కామెడీ సీన్లకు ఈయన అందించిన మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. కనుక ప్రేక్షకులు ఆయా సీన్లను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక ఈ మూవీలో నాని నటన, కథ, కథనం, దర్శకత్వం, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే అంశాలు. సినిమా నిడివి ఎక్కువ కావడం, మొదటి భాగంలో అక్కడక్కడా కొన్ని సీన్లు, పాటలు మైనస్ పాయింట్స్. అయితే ఓవరాల్‌గా చూస్తే ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. దీన్ని ఒకసారి కచ్చితంగా చూడవచ్చని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…