Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి అందరికీ తెలిసిందే. ఈమె తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. ఎప్పుడూ ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన తండ్రి సినిమాలకు చెందిన పాటలతోపాటు పలు ఇతర పాటలకు కూడా ఈమె అద్భుతంగా డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆమె డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు, మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.

ఇక తాజాగా శ్రీరామనవమి సందర్భంగా సితార అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఒక శ్లోకంలో రాముడి గొప్పదనం గురించి ఉంటుంది. దానికి ఆమె కూచిపూడి డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియోను మహేష్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వీడియోకు కామెంట్ కూడా పెట్టారు.
View this post on Instagram
సితార చేసిన తొలి కూచిపూడి డ్యాన్స్ ఇది. శ్రీరామనవమి రోజు ఈ వీడియోను మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సితార చేసిన డ్యాన్స్‌కు చెందిన శ్లోకంలో శ్రీరాముడి గొప్పదనాన్ని వివరించారు. ఈమె ఈ శ్లోకానికి చేసిన నాట్యం అద్భుతంగా ఉంది. అందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆమెకు నాట్యం నేర్పిన గురువులకు థ్యాంక్స్ చెబుతున్నా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.. అని మహేష్ ఆ వీడియోకు కామెంట్ పెట్టారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.