Singer Shruti : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. ఆచార్య. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. పూజా హెగ్డె ఇంకో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటీటీలోనూ ఈ మూవీకి వ్యూస్ అసలు రావడం లేదు. మెగాస్టార్ సినిమా కెరీర్‌లోనే అతి పెద్ద ఫ్లాప్‌గా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లు నష్టం వచ్చిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలంటూ డిస్ట్రిబ్యూటర్లు కోరగా.. రామ్ చరణ్ హామీ ఇచ్చారు.
ఇక ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొన్ని సీన్లలో ఓ అమ్మాయి నటించింది గుర్తుంది కదా. ఈ మూవీలో ఆమె ఘట్టమ్మగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆమె సింగర్ ఎంఎల్ శృతి. ఈమె చిరంజీవి పక్కన స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తనకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఇష్టమని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని.. అయితే ఇప్పుడు ఆయన పక్కనే నటించే చాన్స్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఆ సీన్లలో నటిస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్‌లో ఆయనతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
తనకు ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు శృతి ధన్యవాదాలు తెలియజేసింది. ఇక టాలీవుడ్‌లో చక్కని సింగర్‌గా శృతి మంచి పేరు తెచ్చుకుంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ మూవీలో ఈమె అడిగా అడిగా అనే పాట పాడింది. కాగా ఈమె నటుడు జయంత్‌ని పెళ్లి చేసుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…