IPL 2022 Final : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ అట్టహాసంగా ముగిసింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు 1 లక్షకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో ఓ రికార్డు క్రియేట్ అయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియం ప్రపంచంలోని క్రికెట్ స్టేడియాలలో అతి పెద్ద స్టేడియం కావడం విశేషం. ఇక ఫైనల్ మ్యాచ్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌పై ఇప్పుడు ప్రేక్షకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌లను ట్రెండ్ చేస్తున్నారు. అందుకు వారు పలు కారణాలను కూడా చూపిస్తున్నారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో అమిత్ షా విక్టరీ సింబల్ చూపించారు. అలాగే రాజస్థాన్ ప్లేయర్ సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ టీమ్ గతంలో ఆడిన మ్యాచ్ లలో చేజింగ్ ద్వారానే చాలా మ్యాచ్‌లను గెలిచింది. దీంతో ఈసారి ఫైనల్‌లోనూ గుజరాత్‌కు టార్గెట్ చేజింగే వచ్చింది. అయితే సంజు శాంసన్ కావాలనే ఇలా చేశాడని.. ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే తరువాత గుజరాత్ కు చేజింగ్ వస్తుంది కదా.. కనుక వారు సులభంగా గెలవొచ్చనే ఉద్దేశంతోనే సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడని.. లేదంటే రాజస్థాన్ గెలిచి ఉండేదని.. కావాలనే ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచేలా అన్ని విధాలుగా ఫిక్స్ చేశారని.. ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ జరిగింది నరేంద్ర మోదీ స్టేడియంలో.. రెండు జట్లలో ఒకటి గుజరాత్ జట్టు.. కనుక గుజరాత్‌కు విజయాన్ని కట్టబెట్టాలని చూశారని.. చివరకు అదే జరిగిందని.. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని క్రికెట్ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆరోపిస్తూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే దీనిపై అటు బీసీసీఐ గానీ.. ఇటు ఐపీఎల్ యాజమాన్యం కానీ స్పందించలేదు. వారు ఏమంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…