Singer Chinmayi : సింగర్ చిన్మయి శ్రీపాద, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌లకు కవలలు జన్మించారు. ఈ క్రమంలోనే వారు తమ మగ శిశువుల పేర్లను కూడా ప్రకటించారు. ద్రిపత్, శర్వాస్ అని నామకరణం చేశారు. వారితో దిగిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా చిన్మయి సింగర్‌గానే కాక సోషల్ మీడియాలోనూ ఎంతో మందికి పరిచయమే. ఈమె సమాజంలో జరిగే అనేక సంఘటనలతోపాటు మహిళలపై జరిగే అఘాయిత్యాలు, వేధింపులు వంటి సంఘటనలపై స్పందిస్తుంటుంది.
చిన్మయికి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉండగా.. వీరికి కవలలు పుట్టారని తెలిసి చాలా మంది వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే చిన్మయి తన గర్భం వార్తను మాత్రం చాలా మందికి తెలియకుండా జాగ్రత్త పడింది.

చిన్మయి, రాహుల్ రవీంద్రన్‌లు 2014లో వివాహం చేసుకోగా.. వీరికి ఇప్పుడే సంతానం కలిగారు. ఇక మ్యూజిక్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, వివక్షపై చిన్మయి ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. అలాగే మహిళా సమస్యలపై కూడా ఈమె స్పందిస్తుంటుంది. కానీ కొన్ని సార్లు ఈమె పెట్టే పోస్టులు వివాదాస్పదం అవుతుంటాయి. దీంతో ఆమె గతంలో చాలా సార్లు నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌ను, విమర్శలను ఎదుర్కొంది. ఇక ఆగస్టు 2005లో చిన్మయి బ్లూ ఎలిఫెంట్ అనే ఓ సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఆమె సీఈవోగా ఉంది. ఈ కంపెనీ ద్వారా ట్రాన్స్‌లేషన్ సర్వీసెస్‌ను అందిస్తున్నారు. ఇక ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పలు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Driptah and Sharvas
The new and forever center of our Universe. ❤️
@rahulr_23 pic.twitter.com/XIJIAiAdqx— Chinmayi Sripaada (@Chinmayi) June 21, 2022