Siddharth : తెలుగు ప్రేక్షకులకు నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో సిద్ధార్థ్ యంగ్ హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. అగ్ర హీరోలతో పోటీగా ఈయన సినిమాలు ప్రదర్శితం అయ్యేవి. అయితే రాను రాను సిద్ధార్థ్‌కు ఆఫర్లు తగ్గిపోయాయి. ఈ మధ్యే మహా సముద్రం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం సిదార్థ్ ఇండియన్ 2లో నటిస్తున్నాడు. అయితే తాజాగా సిద్ధార్థ్.. బ్యూటీ క్వీన్ అదితిరావు హైదరితో కలిసి ముంబైలో కనిపించాడు. దీంతో వీరిపై గాసిప్స్ ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. వీరు రిలేషన్ షిప్‌ను మెయింటెయిన్ చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం వీరు ఎక్కడ చూసినా కలసి కనిపిస్తున్నారు. ముంబైలో తాజాగా ఓ పార్టీలో వీరు తళుక్కుమన్నారు. అయితే తమను ఫొటోలు తీయవద్దని సిద్ధూ వార్నింగ్ ఇచ్చాడట. అందువల్లే వీరి ఫొటోలు బయటకు రాలేదు. అయితే వీరు లవ్ ట్రాక్ నడిపిస్తున్నారా.. రిలేషన్ షిప్‌లో ఉన్నారా.. అన్న విషయం మాత్రం తేలలేదు. ఇక అదితి రావు హైదరి కూడా నటిగా తానేంటో నిరూపించుకుంది. కానీ ఈ అమ్మడికి కూడా ప్రస్తుతం లక్ కలసి రావడం లేదు. మహా సముద్రం మూవీలో ఈమె కూడా యాక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావల్సి ఉంది.

ఇక సిద్ధార్థ్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించగానే ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆమెను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేశారు. తరువాత పాన్ ఇండియా స్థాయి సినిమాలను తక్కువ చేసి మాట్లాడాడు. పాన్ ఇండియా కాదని, ఇండియన్ మూవీలు అని పిలవాలని కామెంట్స్ చేసి మళ్లీ విమర్శల పాలయ్యాడు. ఇక తాజాగా అదితితో అతను లవ్ ట్రాక్ నడిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.