Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా, సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే దసరా కానుకగా కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివర క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. నాని, సాయి పల్లవి జంటగా ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…