Balakrishna : నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ముందుగా డైరెక్టర్లు, నిర్మాతలు హీరోయిన్ వేటలో పడతారు. బాలకృష్ణతో నటించాలంటే హీరోయిన్లు కొంత భయంతో ఆయన సినిమాల్లో నటించడానికి ఒప్పుకోరు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో సినిమా అంటే దర్శక నిర్మాతలకు హీరోయిన్లను వెతకడం కత్తి మీద సాము వంటిది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.
ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించడానికి హీరోయిన్ చాలా తొందరగా దొరికిందని చెప్పవచ్చు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ సరసన నటించడానికి క్రాక్ బ్యూటీ శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
అయితే ఇందులో శృతి హాసన్ ముందుగా నో చెప్పినా.. దర్శకుడు అడగడంతో కాదనలేకపోయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన బలుపు చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అదేవిధంగా వీరిద్దరి కాంబినేషన్లో తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో దర్శకుడు అడగడంతో శృతి హాసన్ వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.