Shruti Haasan : అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తోంది. సినిమాలు, ప్రేమాయణంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్ ని నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయింది శృతి హాసన్. అందానికి అందం.. నటనకు నటన.. చేస్తూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే వరుస చిత్రాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ అనే చిత్రం చేస్తోంది.
నిజాయితీతో ప్రతి రోజూ అందమైన పాఠం నేర్చుకుంటాం అని చెబుతోంది శృతి హాసన్. జీవితంలో ఆటుపోట్లు ఎదురు అయినప్పుడు కంగారు పడిపోయే రకం కాదు నేను. ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తా. తప్పు అనగానే మొదట ఎదుటి వాళ్లవైపు చూస్తుంటాం. నేను ఆత్మవిమర్శ చేసుకున్నాకే మిగతా విషయాల గురించి ఆలోచిస్తుంటా.. అని చెప్పుకొచ్చింది శృతి హాసన్.
శృతి హాసన్ ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో రిలేషన్ షిప్ నడుపుతోంది. ఆమె తన కొత్త రిలేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె డేటింగ్ చేస్తోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. శృతి హాసన్ ఎప్పటికప్పుడూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తమ మధ్య ఉన్న అపరిమితమైన ప్రేమను చాటుకుంటోంది. కాగా గతంలో శృతి లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే.