Shruti Haasan : ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాయ్ ఫ్రెండ్‌తో కలిసి శృతి హాసన్ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో వీరు తరచూ ఏదో ఒక అప్‌డేట్‌ను తమ సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇక కరోనా సమయంలో ఇద్దరూ లవ్‌లో పడగా.. అప్పటి నుంచి వీరు రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల శృతి హాసన్ వరుసగా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్న ఫొటోలను షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో కలిసి శృతి రెచ్చిపోతోంది.
కాగా శృతి హాసన్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సెల్ఫీలు దిగి వాటిని పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో ఆమె అందాలు వర్ణించరాకుండా ఉన్నాయి. భారీ ఎద అందాలను ప్రదర్శిస్తూ ఈమె చేస్తున్న గ్లామర్ షోకు యువత ఫిదా అవుతున్నారు. మండుతున్న ఎండల్లో ఈమె అందాలు మరింత సెగలు పుట్టిస్తున్నాయి. ఇక శృతి హాసన్ లేటెస్ట్‌గా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా ఈమె ప్రస్తుత పలు వరుస మూవీలతో ఎంతో బిజీగా ఉంది. చిరంజీవితో కలిసి మెగా154 వర్కింగ్ టైటిల్‌తో నిర్మాణమవుతున్న సినిమాలో ఈమె నటిస్తోంది. దీనికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణతో కలిసి ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈమె నటిస్తోంది. దీనికి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈయనతో కలిసి గతంలో బలుపు సినిమాలో ఈమె నటించింది. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ సలార్‌లోనూ ఈ భామ నటిస్తోంది.