Shruti Haasan : తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో శృతి హాసన్ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. తండ్రి కమలహాసన్ బ్యాక్‌గ్రౌండ్‌ను ఏమాత్రం ఉపయోగించకుండా ఆమె తన స్వశక్తితో, సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక ఫిట్‌నెస్ విషయంలోనూ ఈమె ఎప్పటికప్పుడు జాగ్రత్తలను పాటిస్తూనే ఉంటుంది.
శృతి హాసన్ తాజాగా వర్కవుట్ సెషన్‌లో పాల్గొంది. అందులో నేలపై బోర్లా పడుకుని ఆమె నడుమును అటు, ఇటు తిప్పుతూ వర్కవుట్ చేసింది. ఆ వీడియో చూస్తుంటే కుర్రకారు మతులు పోతున్నాయనే చెప్పవచ్చు.
https://www.instagram.com/reel/CUpANdKAiYe/?utm_source=ig_web_copy_link
శృతి హాసన్ రవితేజతో క్రాక్ మూవీలో నటించగా, వకీల్ సాబ్‌లోనూ పవన్ సరసన నటించింది. రెండూ హిట్ అయ్యాయి. ఇక ప్రభాస్‌తో కలిసి సలార్ మూవీలో నటిస్తోంది. ఈమె ప్రస్తుతం ముంబైలో తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో కలిసి జీవిస్తోంది. శంతను ఓ డూడుల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు.