Shriya : టాలీవుడ్ సినీ నటి శ్రియకు రీసెంట్ గా పాప పుట్టిన విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఈమె గతేడాది పాపకు జన్మనిచ్చింది. దీంతో శ్రియ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తన లైఫ్ లో జరిగిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకుంది. నటి శ్రియ భర్త ఆండ్రీ కోస్చేవ్ తన పాపకు రాధ అనే పేరుని పెట్టారని కూడా తెలిపింది.
అయితే ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటో శ్రియ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. శ్రియ.. మా అమ్మకు ఒక అమ్మాయి పుట్టిందని చెప్పినప్పుడు.. ఓహ్ రాధా రాణి వస్తోందని అన్నదట. అలా ఆండ్రీ.. ఓహ్ మీ అమ్మ నిజంగా సంతోషంగా ఉందని అన్నాడట. అప్పుడు శ్రియ భర్త ఆమెను రష్యన్ పేరుతో ఎందుకు పిలుస్తున్నారని అడిగితే.. రాధ అంటే రష్యన్ లో సంతోషంగా ఉందని అర్థం. అందుకే శ్రియ దంపతుల కుమార్తెకు రాధ అని పేరు పెట్టినట్లు తెలిపారు. అలాగే తన పూర్తి పేరు రాధా సరన్ కోస్చివ్ అని అన్నారు.
రాధ అంటే రష్యన్ భాషలో సంతోషంగా ఉంది.. అలాగే సంస్కృతంలో కూడా సంతోషంగా ఉందనే మీనింగ్ వస్తుందని అన్నారు. అలాగే తమ పాపను అలా పిలుచుకోవడం ఇంకా సంతోషంగా ఉందని శ్రియ తెలిపింది. అలాగే డెలివరీ కూడా చాలా సులువుగా అయ్యిందని, రాధ పుట్టినప్పుడు తన తల్లి తనతోనే ఉందని శ్రియ తెలియజేసింది. డెలివరీ అయ్యాక చేసే ప్రతి పని పట్ల, చేసే వారి పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని చెప్పింది. అలాగే ప్రతిరోజు తాను తన గురించి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని తెలిపింది. ప్రస్తుతం శ్రియ పలు సినిమాల్లో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…