Arya 3 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆర్య. ఈ సినిమా బన్నీ కెరీర్‌ని పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ఇందులో ఆర్యని చాలా స్టైలిష్‌గా చూపించాడు సుక్కూ. ఇక ఆర్య 2 చిత్రం కూడా ఇదే కాంబినేషన్‌లో రూపొందగా, ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇటీవల ఫాల్కన్ క్రియేషన్స్ సహకారంతో ఆర్య 3 ఉంటుందని సుకుమార్ ప్రకటించాడు.
పూరీ దేశముదురు చిత్రం బన్నీని పక్కా మాస్ అండ్ స్టైలిష్ హీరోగా ఎలివేట్ చేస్తే ఆ స్థాయిని ఆర్య 2 మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఇక ఆర్య 3 చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో సుకుమార్ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ను అయితే ఇచ్చాడు. ఇందులో హీరో ఎవరు అనే విషయంపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. బన్నీనే హీరో అని అందరు కోరగా, తాజాగా ఫ్రేంలోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు వచ్చింది.
యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అయితే ఆర్య 3కి సరిగ్గా సరిపోతాడని అందరు భావిస్తున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. మరోవైపు అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించడమే ధ్యేయంగా సుకుమార్ పుష్ప ఫ్రాంఛైజీని తెరకెక్కిస్తున్నారు. పుష్ప-1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇక విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…