Shriya Saran : అందాల ముద్దుగుమ్మ శ్రియ ఒకప్పుడు స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లాడగా, ఆ తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో శ్రియ కీలక పాత్ర పోషించింది. అయితే కొన్నాళ్లుగా తన భర్తతో తెగ సందడి చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది శ్రియ.
తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరికీ షాకిచ్చే విషయం గురించి చెప్పుకొచ్చింది. గతేడాది స్పెయిన్‌లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో శ్రియ పండంటి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది..
శ్రియ తాజాగా తను పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలియజేసింది. ఏడాది తర్వాత ఈ ముద్దుగుమ్మ నోరు విప్పడం విశేషం. 2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్ కారణంగా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది.
చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను.. అంటూ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…