Hari Hara Veera Mallu : ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ షురూ..!

Hari Hara Veera Mallu : ప‌వ‌న్ క‌ల్యాణ్, నిధి అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూవీ.. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప‌వ‌న్ బందిపోటు దొంగ పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతోఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. వాస్త‌వానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. దీంతో బ‌డ్జెట్ భారీగా పెరిగిపోయింది. అయితే క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఫ‌స్టాఫ్‌ను మాత్ర‌మే షూటింగ్ చేశారు. అది కూడా కొన్ని సీన్లు ప‌వ‌న్‌కు న‌చ్చ‌లేద‌ట‌. దీంతో వాటికి మార్పులు చేయాల‌ని క్రిష్‌కు ప‌వ‌న్ సూచించార‌ట‌.

అయితే క్రిష్ ఆ సీన్లలో మార్పులు చేసేందుకు అంగీక‌రించ‌లేద‌ని స‌మాచారం. దీంతో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ఆగిపోయింది. ఆ మార్పులు చేసేవ‌ర‌కు తాను షూటింగ్‌లో పాల్గొన‌బోన‌ని ప‌వ‌న్ క‌చ్చితంగా చెప్పేశార‌ట‌. దీంతో ఈ మూవీ సందిగ్దంలో ప‌డిపోయింది. మ‌రోవైపు అక్టోబ‌ర్ నుంచి ప‌వ‌న్ 6 నెల‌ల పాటు బ‌స్సు యాత్ర చేస్తారు. త‌రువాత ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌ల‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ అట‌కెక్కిన‌ట్లే అని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆందోళ‌న చెందిన నిర్మాత ఏఎం ర‌త్నం ఇద్ద‌రికీ స‌యోధ్య కుదిర్చే ప‌నిలో ప‌డ్డారు. ఆయ‌న విజ‌య‌వంతం అయిన‌ట్లు కూడా తెలుస్తోంది. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు విష‌యంలో ప‌వ‌న్ చెప్పిన మార్పులు చేసేందుకు క్రిష్ అంగీక‌రించేలా ర‌త్నం ఒత్తిడి తెచ్చార‌ట‌. దీంతో క్రిష్ ఇందుకు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

Hari Hara Veera Mallu

అయితే మూవీ షూటింగ్‌కు ప‌వ‌న్ అక్టోబ‌ర్ వ‌ర‌కు మాత్ర‌మే స‌మ‌యం ఇచ్చార‌ని తెలుస్తోంది. ఆ లోపు ఇంత పెద్ద మూవీని షూటింగ్ పూర్తి చేయ‌డం అవుతుందా.. అని సందేహాలు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ నిర్మాత ఏఎం ర‌త్నం ఎలాగో మూవీని పూర్తి చేసి విడుద‌ల చేయాల‌ని చూస్తున్నార‌ట‌. అలా జరిగితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన న‌ష్టాన్ని కాస్త‌యినా భ‌ర్తీ చేసుకోవ‌చ్చు. అలా కాకుండా మూవీ షూటింగ్ ఇంకా ఆల‌స్యం అయితే సినిమాకు ఇంకా ఎక్కువగానే న‌ష్టం వ‌స్తుంది. క‌నుక ర‌త్నం.. క్రిష్, ప‌వ‌న్‌ల‌తో మాట్లాడి వారికి స‌యోధ్య‌ను కుదిర్చార‌ని తెలుస్తోంది. దీంతో మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇది ప‌వ‌న్ అభిమానుల‌కు నిజంగా శుభ‌వార్తే అని చెప్ప‌వ‌చ్చు.

ఇక హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుతోపాటు వినోద‌య సీత‌మ్ అనే మూవీ రీమేక్‌ను కూడా ప‌వ‌న్ ఇదే స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రి రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి అవుతుందా.. కాదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది. ఇక హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుకు బెన్ లాక్ గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఈయ‌న ఆక్వామాన్‌, స్టార్ వార్స్ వంటి హాలీవుడ్ మూవీల‌కు గ్రాఫిక్స్ చేశారు. దీంతో అత్యద్భుత‌మైన గ్రాఫిక్స్‌ను ఇందులో చూసేందుకు అవ‌కాశం ల‌భించ‌నుంది. ఇక నిధి అగ‌ర్వాల్‌తోపాటు బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి, న‌టుడు అర్జున్ రామ్ పాల్ కూడా ఈ మూవీలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM