Ankitha : ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సింహాద్రి మూవీ గుర్తుంది కదా. ఈ మూవీలో ఎన్టీఆర్ తన మాస్ విశ్వ రూపాన్ని చూపించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఎన్‌టీఆర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇక ఈ మూవీలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. అయితే భూమిక సెకండ్ ఇన్నింగ్స్ తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది. కానీ అంకిత మాత్రం సినిమాలకు దూరమైంది. ఇక ఈమె ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. అన్న వివరాలను తెలుసుకుందాం.
అంకిత బాలనటిగా కూడా యాక్ట్ చేసింది. అప్పట్లో ఈమె రస్నా యాడ్‌లో నటించి పాపులర్ అయింది. తరువాత కూడా పలు యాడ్స్‌లోనూ నటించింది. అయితే హీరోయిన్‌గా తెలుగులోనే మొదటి చిత్రం చేసింది. అప్పట్లో వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో ఈమె సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈమెకు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు బాగానే వచ్చాయి.
అలా హీరోయిన్ గా మారిన అంకితకు ఎన్‌టీఆర్ సరసన సింహాద్రిలో నటించే అవకాశం లభించింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో అంకితకు ఆఫర్లు బాగానే వచ్చాయి. తరువాత ఈమె స్టేట్ రౌడీ, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు అనే మూవీలు చేసింది. అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె అందాలను ఆరబోయడంలో అందరికన్నా ఒక మెట్టుపైనే ఉండేది. దీంతో ఈమెను చూసి కుర్రకారు మైమరిచిపోయేవారు.
ఇక తరువాత ఆమె చేసిన అనేక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె కెరీర్‌లో డౌన్ ఫాల్ మొదలైంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు రాకపోయేసరికి ఈమె పూణెకు చెందిన వ్యాపారవేత్త విశాల్‌ను పెళ్లి చేసుకుంది. అక్కడే సెటిల్ అయిపోయింది. అలాగే తన తండ్రికి ఉన్న వజ్రాల వ్యాపారాన్ని ప్రస్తుతం ఈమె చూసుకుంటోంది. కానీ సినిమాల్లోకి వస్తారా.. అని ఈ మధ్యే ప్రశ్నించగా.. తనకు ఆ ఉద్దేశం లేదని కచ్చితంగా చెప్పేసింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇక ఏమీ ఎంట్రీ ఉండదని స్పష్టమైంది. అయినప్పటికీ వ్యాపారంలో మాత్రం బాగానే రాణిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…