Shivatmika : ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మెన్‌గా ప్రేక్షకుల మనసులు దోచుకున్న హీరో రాజశేఖర్. ఆయన ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక ఆయన కూతుళ్లు కూడా తగ్గేదేలే అంటూ రచ్చ చేస్తున్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో నానా హంగామా సృష్టిస్తున్నారు. శివాత్మిక ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే దుబాయ్‌లో అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేస్తోంది. తన అక్క శివానీ రాజశేఖర్, ఫ్రెండ్, హీరోయిన్ ఈషారెబ్బాలు కలిసి దుబాయ్‌లో రచ్చ చేస్తున్నారు. ముగ్గురూ కలిసి నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌లో మునిగి తేలుతున్నారు. బ్రేకుల్లేకుండా తమ ఎంజాయ్‌మెంట్‌ని ఆస్వాదిస్తున్నారు.

అయితే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాజశేఖర్ కుమార్తె లేచిపోయిందని సోషల్ మీడియాలో ఓ సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియా రాసుకొచ్చింది. ఇది ఆ నోటా, ఈ నోటా పడి.. ఆ పుకారు రాజశేఖర్ ఫ్యామిలీకి చేరింది. దాంతో రాజశేఖర్, జీవిత దంపతులు, చిన్న కుమార్తె శివాత్మిక ఫైర్ అయ్యారు. తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లినట్టు ఆమె తెలిపారు. దుబాయ్‌లో దిగిన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు శివాత్మిక. వీళ్ళ (రాజశేఖర్, జీవిత, శివాని)తో కలిసి దుబాయ్ వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి.. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు ? నేను లేదా శివాని లేచిపోయింది ఎవరితో ? నాన్ సెన్స్ రూమర్స్ ! నెక్స్ట్ లెవల్ న్యూస్ ఇది ! రూమర్స్ రాసేటప్పుడు క్లారిటీగా ఉండండి. లేచిపోయింది ఎవరు ? నేనా ? శివానీనా ? బీ క్లియర్.. అని ఘాటుగా శివాత్మిక పోస్ట్ చేశారు.
శివాత్మిక పోస్ట్‌తో రూమర్స్‌కి చెక్ పడింది. అక్క శివానీ కంటే ముందు ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే తన నటనతో సిల్వర్ స్క్రీన్ పై ముద్ర వేసింది ఈ చిన్నది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయ్యారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.