Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ షాలినీ పాండే. ఈ అమ్మడు తొలుత గ్లామరస్‌గా కనిపించలేదు. కానీ ఆ తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం గ్లామర్ షో చేయక తప్పడం లేదు. ముఖ్యంగా ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వరుస ఫొటోలతో మతులు పోగొడుతోంది. ఎద అందాలు కనిపించేలా డ్రెస్‌లను ధరించి అలరిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె స్విమ్మింగ్ పూల్‌లో సేదదీరుతూ కనిపించి షాకిచ్చింది. ఆ ఫొటోల్లో ఆమె మరింత గ్లామర్‌గా కనిపిస్తుండడం విశేషం.
షాలినీ పాండే అర్జున్ రెడ్డి తరువాత పలు తెలుగు, హిందీ, తమిళ మూవీల్లో నటించింది. కానీ ఏవి పెద్దగా హిట్ కాలేదు. తెలుగులో మహానటిలో చిన్నపాత్రలో నటించింది. తరువాత ఎన్‌టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవి ఆకట్టుకోలేకపోయాయి. దీంతో షాలినీ పాండే కెరీర్ ప్రమాదంలో పడింది.

ఇక ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు లేవు. మహారాజ అనే ఒక హిందీ సినిమాలో మాత్రం చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఇంత గ్లామర్ షో చేస్తున్నా ఈమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి ముందు ముందు అవకాశాలు వస్తాయో.. రావో.. చూడాలి.
View this post on Instagram