Shakeela : శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఒకప్పుడు ఆమెకి ఉన్న పాపులారిటీ సినిమా హీరోలకు కూడా ఉండేది కాదు. షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంతలా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకున్నారు.
వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న షకీలా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘క్యాష్’ గేమ్ షోలో సందడి చేశారు. జ్యోతి, సంపూర్ణేశ్ బాబు, అభినయశ్రీలతో కలిసి గేమ్ పాల్గొన్న షకీలా తన గతాన్ని గుర్తు చేసుకుంది.
తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ”మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నా కష్టాలను ఆయన దగ్గరుండి చూశారు. ఓ సినిమా షూట్‌కు నాన్న నాతోపాటు సెట్‌కి వచ్చారు. ఓ షాట్‌లో నేను భవనంపై నుండి దూకాలి. డూప్స్ లేకపోవడంతో నేను అలానే దూకేశాను. కాలు విరిగింది. అది చూసి మా నాన్నకు గుండెపోటు వచ్చింది. అలాంటి యాక్షన్ తరహా సన్నివేశాలు చేయవద్దని నాన్న చెప్పారు.. అంటూ షకీలా కన్నీరు పెట్టుకుంది. మిగతా కంటెస్టెంట్స్ నవ్వులు పూయించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…