Tollywood : సెలబ్రిటీ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా విడాకుల పరంపర నడుస్తోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అనేక సెలబ్రిటీ జంటలు ఈ మధ్య కాలంలో విడాకులను తీసుకున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ తన భార్య కిరణ్ రావుకు విడాకులు ఇవ్వగా.. టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్లు గత అక్టోబర్‌లో ప్రకటించారు. ఈ క్రమంలోనే వారి విడాకుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

ఇక ఈ మధ్యే ధనుష్ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అయితే వారిని కలిపేందుకు ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్లు ఉన్న ఓ సీనియర్ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు అప్లై చేశారట. ఆయన తెలుగు, బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలలో చక్రం తిప్పారు. అప్పట్లో లీడింగ్ హీరోగా ఉన్నారు.
ఆ నటుడు చాలా తక్కువ మంది సభ్యులతో ఓ నటిని వివాహం చేసుకున్నాడు. 6 ఏళ్ల వివాహ జీవితం అనంతరం తాజాగా వారు విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. సదరు హీరో ఒకప్పుడు విలన్ గా కెరీర్‌ను ప్రారంభించారు. తరువాత హై ప్రొఫైల్ సినిమాల్లో నటించారు. ఆయనకు 50 ఏళ్లకు పైనే ఉంటాయి. 40లలో ఆయన వివాహం చేసుకున్నారు.
వారి విడాకులకు కారణం తెలియదు. కానీ ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే విడాకులు పొందనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో ఈ విడాకుల విషయం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.