Tapsee : సీనియర్ హీరోయిన్ తాప్సీ ఈ మధ్య కాలంలో చాలా వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తోంది. ఈమె బాలీవుడ్‌లో స్థిరపడిపోయింది. అక్కడ ఈమెకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో తాప్సీ నటిస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడంచింది.

ప్రస్తుతం తాను మహిళా ప్రాధాన్యత ఉన్న కథలనే ఎంపిక చేసుకుంటున్నానని.. అలాంటి సినిమాల్లోనే నటిస్తున్నానని.. తాప్సీ తెలియజేసింది. కమర్షియల్ సినిమాలు చేయబోనని తెలిపింది. కొందరు తన వద్దకు ఫీమేల్ లీడ్ కథతో వచ్చి ఈ కథ మీ కోసమే రాశానని చెబుతున్నారని.. అలా వారు చెప్పినప్పుడు తనకు థ్రిల్‌గా అనిపిస్తుందని తాప్సీ కామెంట్ చేసింది.
కాగా తాప్సీ ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంది. బాలీవుడ్‌లో ఈమెకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అందులో భాగంగానే త్వరలో ఈమె సమంతతో కలిసి ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాను తీయనుందని వార్తలు వచ్చాయి. మరి సమంత అందులో నటిస్తుందా.. లేదా చూడాలి.