Niharika : చాలా మంది సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా పరిచయం అవుతారు. వారిలో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాత తరానికి హీరో హీరోయిన్స్ గా రంగుల ప్రపంచంలో అడుగు పెడతారు. ఇంకొందరు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి ఒకటి, రెండు సినిమాలతో కనుమరుగైపోతుంటారు. చేసింది ఒకటి రెండు చిత్రాలు అయినా వారి నటన పరంగా ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరవుతారు. వారు నటించిన పాత్ర ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక చిన్నారి గురించి. ఈ పాపని గుర్తుపట్టాలి అంటే మీకు ఒక చిన్న క్లూ.. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా.. చిత్రంలో పింకీ గాను, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన యమజాతకుడు చిత్రంలో మేనకోడలుగానూ నటించింది.
అంతేకాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు చిత్రంలో కూడా నటించి అందరినీ మెప్పించింది. ఒక్కడు చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్ హిట్ ను సాధించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు కు జోడీగా భూమిక చావ్లా నటించింది. మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందజేశారు. ముకేశ్ రిషి, ప్రకాష్ రాజ్, తెలంగాణ శకుంతల, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు చెల్లెలిగా ఆశ క్యారెక్టర్‌లో ఎంతో నాచురల్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమెనే బేబీ నిహారిక. ఈ బేబీ నిహారిక నటనపరంగా ఎంతో మంచి గుర్తింపు సాధించి, ఎన్నో మంచి మంచి అవకాశాలు వచ్చినా నో చెప్పేసింది. తన ఫోకస్ చదువుల పై పెట్టి, ఉన్నత విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం నిహారిక మళ్ళీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం కోసం ఫొటోస్ షూట్ తో హడావిడి చేస్తోంది. సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోస్ ను అప్‌డేట్ చేస్తూ అప్పుడప్పుడు నిహారిక ఎంతో గ్లామరస్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఓ ప్రముఖ దర్శకుడు నిహారికకు అవకాశాలు ఇస్తానని చెప్పినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…