Kalyaan Dhev : మెగా డాటర్ శ్రీజను వివాహం చేసుకొని మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడు కళ్యాణ్ దేవ్. అలాగే విజేత సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ మెగా కాంపౌండ్ కి చెందిన వాడా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య నిజంగానే మనస్పర్థలు వచ్చాయా ? లేదంటే విడాకులు తీసుకోబోతున్నారా ? సోషల్ మీడియాలో వీరిద్దరిపై జోరుగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ఇరు కుటుంబాలు స్పందించడం లేదు.
కళ్యాణ్ దేవ్ ప్రత్యేక సందర్భం ఉంటే తప్ప సోషల్ మీడియాలో స్పందించడు. కానీ ఈ మధ్య తన వర్కవుట్లు, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. మీరు ఒకరితో మాట్లాడాలని అనుకుంటారు.. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియదు, చాలా కష్టంగా నవ్వుతుంటారు, మధ్యలోనే ఆపేయాలని అనుకుంటారు, కానీ మీ పక్కన ఉన్న ఫ్రెండ్ మాత్రం ఇంకా నవ్వుతూనే ఉంటాడు, క్లాసుకు లేట్‌గా వెళ్తే.. మనం నడుచుకుంటూ వెళ్తుంటే.. అందరూ మనల్ని చూస్తుంటారు.. మనమేదో హత్య చేసినట్టు..!
మన ఏజ్ గురించి అడుగుతుంటారు.. మనం ఆలోచించి సమాధానం చెబుతాం, మనకు ఒకరితో ఇంకా మాట్లాడాలని ఉంటుంది.. కానీ ఎలా కంటిన్యూ చేయాలో తెలియనప్పుడు.. మనం ఓ కథ చెబుతున్నప్పుడు.. ఎవ్వరూ వినడం లేదని తెలిసినప్పుడు.. ఇక మెల్లిగా జారుకుని ఇంకెప్పుడూ చెప్పకుండా ఉంటాం..
మనం లెక్కను ఎంతో కష్టపడి చేస్తాం.. కానీ ఇచ్చిన ఆప్షన్స్‌లో అది ఉండదు.. అంటూ ఇలా కొన్ని పరిస్థితుల్లో మనకు ఏదోలా అనిపిస్తుంటుంది.. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా ? అంటూ కళ్యాణ్ దేవ్ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. అసలు గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. దీంతో నెటిజన్లు కూడా రెచ్చిపోయి కథలు అల్లేస్తున్నారు. చూడాలి ఎవరు స్పందించి వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడతారో..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…