Sarvadaman D. Banerjee : తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే తెలియనివారుండరు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీపడి మరీ సినిమాల్లో నటిస్తూ హిట్లు కొడుతున్నారు. తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీలో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. మళయాళం సూపర్ హిట్ లూసిఫర్ చిత్రానికి అధికారిక రీమేక్ గా వచ్చిన ఈ సినిమాకు మోహన్ రాజా డైరెక్షన్ చేశారు. అక్టోబర్ 5వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో చిరంజీవితోపాటు లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సల్మాన్ ఖాన్, కీలకమైన పాత్రలలో నటించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి ఒకప్పటి హీరో అని చాలా మందికి తెలియదు. ఈ తరం ప్రేక్షకులు మాత్రం అతన్ని గుర్తించలేకపోయారు. మరి ఆయన ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఆయన పేరే సర్వదమన్ బెనర్జీ. ఒకప్పుడు హీరోగా చేసి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరో.

1986 లో దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాలో సుహాసిని, సర్వదమన్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో ఈ మూవీ ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ చాలా మందిని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇలా ఎన్నో సినిమాల్లో చేసిన ఆయన అకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. దాదాపు 35 సంవత్సరాల తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఆయనను చూసిన వారు ఇప్పుడు గుర్తు పట్టకుండా మారిపోయాడని అంటున్నారు.