Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుండగా.. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం చిత్ర యూనిట్ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇక లేటెస్ట్‌గా మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మహేష్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే సినిమాలో కొన్ని సీన్లు మాత్రం అద్భుతంగా ఉంటాయని ఆయన చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్‌పై ఇంట్రెస్ట్ పెరిగింది.
ఈ మూవీలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే తనకు, వెన్నెల కిషోర్ కు మధ్య నడిచే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని.. తమ మధ్య వచ్చే కామెడీ సీన్లకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయమని.. మహేష్ అన్నారు. చూస్తుంటే గతంలో వీరు కలిసి నటించిన దూకుడు సినిమాలోని సీన్లు ఈ మూవీలోనూ రిపీట్ అవుతాయని తెలుస్తోంది. ట్రైలర్‌లోనూ వెన్నెల కిషోర్ కామెడీ ఏంటో చూపించారు. ముఖ్యంగా ఒక సీన్ లో ఆయన.. ఊరుకోండి సార్.. ఇప్పుడే మీకు పెళ్లి ఏంటి, మీరు ఇంకా చిన్న పిల్లాడు అయితేనూ.. అని అంటారు. దీనికి మహేష్ జవాబు చెబుతూ.. ఊరుకోండి.. అందరూ అలాగే అంటున్నారు. మెయింటెయిన్ చేయలేక దూలతీరిపోతోంది.. అంటూ కీరదోస ముక్కలను మహేష్ కళ్లపై పెట్టుకుంటారు. ముఖ్యంగా ట్రైలర్ ఈ సీన్ అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయని మహేష్ చెప్పడం విశేషం.
ఇక వెన్నెల కిషోర్‌కు తనకు మధ్య నడిచే ట్రాక్, ఆయా సందర్భాల్లో వచ్చే సీన్లకు చెందిన బ్లాక్స్ అద్భుతంగా ఉంటాయని మహేష్ చెప్పారు. కాగా ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. దీనికి థమన్ సంగీతం అందించారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు అన్నీ బాగున్నాయని ఇప్పటికే ప్రేక్షకులు వెల్‌డన్ చెప్పేశారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…