Sankranthi 2022 : సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లోనూ సందడి నెలకొంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతోపాటు ఉత్తరాయణంలోకి వస్తాడు. అందుకనే ఈ రోజును మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ క్రమంలోనే సంక్రాతి పండుగ రోజు ఎక్కడ చూసినా తెలుగు వారి వాకిళ్లన్నీ రంగు రంగుల రంగవల్లికలు, గొబ్బెమ్మలతో దర్శనమిస్తుంటాయి.
ఇక సంక్రాంతి పండుగకు ఎంతో హడావిడి ఉంటుంది. రైతులకు పంట చేతికి వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఆనందాలు నెలకొంటాయి. పిండి వంటలను ఆరగిస్తూ, పతంగులను ఎగుర వేస్తూ ఉత్సాహంగా పండుగను జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది.
జనవరి 15న మధ్యాహ్నం 2.43 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు దివ్యమైన ముహుర్తం ఉంది. అందువల్ల ఈ సమయం పూజలకు, కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైందని చెబుతున్నారు. ఇక సంక్రాంతి రోజు పలు కార్యక్రమాలు చేయడం వల్ల సకల సంపదలు కలగడంతోపాటు అన్ని సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషాలు నెలకొంటాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కనుక సంక్రాంతి రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసి గడపకు పసుపు, కుంకుమ రాయాలి. గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలను అలంకరించాలి. పూల తోరణాలను కట్టాలి. దీని వల్ల ఇంట్లో ఉండు చెడు ప్రభావం తొలగిపోతుంది. మంచి ప్రభావం ఏర్పడుతుంది.
సంక్రాంతి రోజు ఇంట్లోని పూజ గది లేదా మందిరాన్ని అలంకరించుకోవాలి. పితృ దేవతలకు పూజలు చేయాలి. దీంతో వారి ఆశీస్సులు లభిస్తాయి. చేసే పనిలో తిరుగుండదు. లాభాలను ఆర్జిస్తారు. సంక్రాంతి రోజు మహిళలు పువ్వులు, పసుపు, కుంకుమ, బెల్లం, పండ్లను దానం చేయడం వల్ల సకల సంపదలు లభిస్తాయి. అలాగే మహిళలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం కలుగుతుంది.
పండుగ నాడు ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి బట్టలు పెట్టాలి. దీంతో వారి కాపురం కలహాలు లేకుండా సాగుతుంది. అలాగే యాచకులకు అన్నదానం చేయాలి. దీంతో పుణ్యం లభిస్తుంది. ఎవరితోనూ గొడవలు, కొట్లాటలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలి. దీని వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…