Ghosts : దెయ్యాలు మిమ్మ‌ల్ని త‌రుముతున్న‌ట్లు క‌ల‌లు వ‌స్తున్నాయా ? దానికి అర్థం ఇదే..!

Ghosts : ప్ర‌తి మ‌నిషికి నిద్రించేట‌ప్పుడు ఏదో ఒక విధ‌మైన క‌ల వ‌స్తుంది. క‌ల‌లు రాని మ‌నుషులు ఉండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. క‌ల‌లు అనేవి స‌ర్వ‌సాధార‌ణం. అయితే క‌ల‌లో క‌నిపించేవి నిజ జీవితంలోనూ జ‌రుగుతాయి.. అని న‌మ్మేవారు కొంద‌రు ఉంటారు. అలా కొంద‌రికి జ‌రుగుతూ ఉంటుంది కూడా. అది యాదృచ్ఛిక‌మే. అంతేకానీ.. క‌ల‌లో క‌నిపించేవి.. నిజ జీవితంలోనూ జ‌రుగుతాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం.

ఇక కొంద‌రిని దెయ్యాలు త‌రుముతున్న‌ట్లు క‌ల‌లు వ‌స్తుంటాయి. దీనికి నిపుణులు చెబుతున్న అర్థం ఏమిటంటే.. మీకు దెయ్యాలు అంటే భ‌యం ఉన్నా.. లేదా దెయ్యాల‌కు చెందిన సినిమాలు చూసినా, క‌థ‌లు విన్నా.. మీకు స‌హ‌జంగానే క‌ల‌లో దెయ్యాలు క‌నిపిస్తాయి. అయితే దెయ్యాలు అంటే మీకు భ‌యం ఉంటే అవి మిమ్మ‌ల్ని త‌రిమిన‌ట్లు క‌ల‌లు వ‌స్తాయి. ఇందులో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇలాంటి క‌ల‌లు తాత్కాలిక‌మే. అప్ప‌టిక‌ప్పుడే ఇలాంటి క‌లలు వ‌స్తాయి. త‌ర‌చూ రావు. అందువ‌ల్ల ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

ఇక కొంద‌రు ఎల్ల‌ప్పుడూ అభ‌ద్ర‌తా భావంతో ఉంటారు. తాము ఏదో కోల్పోయామ‌ని ఫీల‌వుతుంటారు. ఇలాంటి వారికి కూడా క‌ల‌లో దెయ్యాలు త‌రిమిన‌ట్లు అనిపిస్తుంది. ఇలాంటి వారు అయితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేయాలి. లేదంటే త‌ర‌చూ ఇలాంటి క‌ల‌లే వ‌స్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి.

ఇక కొంద‌రికి క‌ల‌లో చ‌నిపోయిన త‌మ వాళ్లు క‌నిపిస్తారు. ఇటీవ‌లే త‌మ కుటుంబ స‌భ్యులు లేదా స‌న్నిహితులు లేదా బంధువుల్లో ఎవ‌రైనా ద‌గ్గ‌రివారు చ‌నిపోతే.. వారితో అనుబంధం ఎక్కువ‌గా ఉంటే.. అలాంటి వారు క‌ల‌లో క‌నిపిస్తారు. ఇది కూడా యాదృచ్ఛిక‌మే. కొంత కాలానికి ఇలాంటి క‌ల‌లు త‌గ్గిపోతాయి. ఎప్పుడో ఒక‌సారి ఇలాంటి క‌ల‌లు వ‌స్తాయి. క‌నుక వీటి గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన‌, ఆలోచించాల్సిన ప‌నిలేదు.

స‌మ‌స్య‌లు చాలా ఎక్కువ‌గా ఉన్న‌వారికి కూడా ఇలా అప్పుడ‌ప్పుడు క‌ల‌లో దెయ్యాలు త‌రిమిన‌ట్లు అనిపిస్తుంది. అంటే అనేక స‌మ‌స్య‌లు చుట్టు ముట్టి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయ‌ని అర్థం. ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డితే ఇలాంటి క‌ల‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

క‌ల‌లో దెయ్యాలు క‌నిపించ‌డం అన్న‌ది స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. ఇత‌ర క‌ల‌ల మాదిరిగానే ఈ క‌ల‌లు కూడా వ‌స్తుంటాయి. క‌నుక క‌ల‌లో దెయ్యాలు క‌నిపించ‌గానే ఆందోళన చెందాల్సిన ప‌నిలేదు. దైవాన్ని పూజించే భ‌క్తులు అయితే ఆంజ‌నేయ స్వామికి న‌మ‌స్కారం చేసి ఆయ‌న దండ‌కం చ‌దివి ప‌డుకోవాలి. అంత‌కు ముందు ఒక గ్లాస్ నీళ్ల‌ను తాగాలి. దీంతో భ‌యం పోతుంది. కానీ దెయ్యాల క‌ల‌ల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM