Samsung Republic Day Sale 2022 : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ప్రత్యేకమైన సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు శాంసంగ్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. దీంతోపాటు పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.
శాంసంగ్ రిపబ్లిక్ డే సేల్ 2022లో గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జి 128జీబీ మోడల్‌ను 27 శాతం తగ్గింపు ధరతో రూ.49,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.74,999గా ఉంది. ఇక గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి ఫోన్‌ను 47 శాతం తగ్గింపుతో రూ.38,749 ధరకు కొనుగోలు చేయవచ్చు.
గెలాక్సీ ఎస్21 5జి ఫోన్‌ను 29 శాతం తగ్గింపుతో రూ.59,999 ధరకు, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 3 5జి ఫోన్‌ను 13 శాతం తగ్గింపుతో రూ.1,40,999 ధరకు, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 2 5జి ఫోన్‌ను 13 శాతం తగ్గింపుతో రూ.1,19,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే గెలాక్సీ ఎస్21 ప్లస్ 5జి ఫోన్‌ను 29 శాతం తగ్గింపుతో రూ.76,999 ధరకు కొనవచ్చు.
సేల్‌లో భాగంగా గెలాక్సీ ఎం52 5జి (6జీబీ ర్యామ్) ఫోన్‌పై 14 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ.29,999 ధరకు కొనవచ్చు. ఎం32 5జి (6జీబీ ర్యామ్) ఫోన్‌పై 13 శాతం తగ్గింపు ధర లభిస్తుంది. దీన్ని రూ.20,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జి (6జీబీ ర్యామ్) ఫోన్‌పై 13 శాతం రాయితీ లభిస్తోంది. రూ.20,999 ధరకు దీన్ని కొనవచ్చు. గెలాక్సీ ఎ52ఎస్ 5జి (8జీబీ ర్యామ్) ఫోన్‌పై 9 శాతం తగ్గింపు ధరను అందిస్తున్నారు. దీన్ని రూ.31,499కి కొనవచ్చు. గెలాక్సీ ఎ22 5జి (8జీబీ ర్యామ్) మోడల్‌పై 8 శాతం తగ్గింపును అందిస్తున్నారు. అందువల్ల దీన్ని రూ.21,999 ధరకు కొనవచ్చు.