Sampoornesh Babu : తెలుగు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు గురించి అందరికీ పరిచయమే. హృదయ కాలేయం సినిమాతో పరిచయమై ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కొబ్బరి మట్ట, బజారు రౌడీ సినిమాలు కూడా మంచి గుర్తింపునిచ్చాయి. ఇక ప్రస్తుతం క్యాలీఫ్లవర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా క్యాలీఫ్లవర్ సినిమా ఈ నెల 26న విడుదల కానున్న సందర్భంగా సంపూర్ణేష్ బాబు కొన్ని విషయాలు పంచుకున్నాడు. మగాడు తన శీలాన్ని కాపాడుకుంటే ఎటువంటి నేరాలు జరగవని అదే ఒక మగాడి శీలం పోతే దాని కోసం పోరాటం చేసేదే ఈ సినిమా కథ అని తెలిపాడు. ఈ సినిమాలో దర్శకుడు తనలోని నటుడిని బయటికి తీసుకొచ్చి నవ్వించే ప్రయత్నం చేశాడని తెలిపాడు.
క్యాలీఫ్లవర్ తో అన్ని వంటకాలు చేసుకోవచ్చని అదే కాలిఫ్లవర్ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయని తెలిపాడు. సినిమా హిట్టయితే ఆడియన్స్ కారణమని.. తేడా కొట్టిందంటే అది తన వల్లనే అని.. మనస్ఫూర్తిగా ఒప్పుకుంటానని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా నుండి ఓ పాట రాబోతుందని, ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపాడు.