Samarasimha Reddy : నందమూరి నట సింహంగా పేరుగాంచిన బాలకృష్ణ తన సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఆయన ఎప్పటికప్పుడు భిన్నమైన చిత్రాలను చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఫ్యాక్షన్ చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఈ మూవీ తరువాతనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. అందువల్ల ఈ మూవీ ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా మారింది. అప్పట్లో ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై ఘన విజయం సాధించింది.
వాస్తవానికి సమరసింహారెడ్డి సినిమా కథ ఆషామాషీగా తయారవ్వలేదు. రచయిత విజయేంద్ర ప్రసాద్ 30 కథలను చెప్పారట. చివరికి ఈ మూవీ కథను దర్శకుడు బి.గోపాల్ ఓకే చేశారట. దీంతో ఈ కథను బాలయ్యకు వినిపించగానే ఆయన ఇక మారుమాట్లాడకుండా వెంటనే ఒకే చెప్పేశారు. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎట్టకేలకు ఈ మూవీ 1999వ సంవత్సరం జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఈ మూవీలో ముందుగా నటి సిమ్రాన్‌కు బదులుగా రాశిని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె అందులో ఉన్న కొన్ని రొమాంటిక్ సీన్లను చేయనని చెప్పింది. దీంతో ఆమె స్థానంలో సిమ్రాన్‌ను తీసుకున్నారు. అలాగే సంఘవి, అంజలా జవేరి లను మరో ఇద్దరు హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఇక ముగ్గురు హీరోయిన్ల ట్రెండ్ కూడా ఈ మూవీతోనే ప్రారంభం అయిందని చెప్పవచ్చు.
కాగా సమరసింహారెడ్డి సినిమాకు రూ.6 కోట్ల వరకు ఖర్చు చేశారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఇలా బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ మూవీ 3 థియేటర్లలో ఏకంగా 227 రోజులు నడిచింది. అలాగే 29 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడింది. బాలకృష్ణను ఒక స్థాయిలో నిలబెట్టిన సినిమా సమరసింహారెడ్డి అని చెప్పవచ్చు. దీనికి పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…