Anchor Suma : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో షోల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈమె చేస్తున్న షోలలో క్యాష్ ఒకటి. ఇది ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటుంది. ఇప్పటికే ఈ షో విజయవంతంగా కొనసాగుతూ ఎంతో మందిని అలరిస్తోంది. ఈ షోలో సుమ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ.. తనదైన శైలిలో గెస్ట్‌లపై పంచ్‌లు వేస్తూ సందడి చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ షోకు సీనియర్ నటులు కృష్ణవేణి, సుభాషిణి, జెన్నీ హాజరయ్యారు. వీరు వయస్సులో వృద్ధులు అయ్యారు కానీ.. యువతలా మారి ఈ షోలో సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ షోకు చెందిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్యాష్ లేటెస్ట్ ప్రోమోలో భాగంగా సుమ వారిచే అనేక ఫీట్లు చేయించింది. నటుడు జెన్నీ అయితే ఈ వయస్సులోనూ అనేక కష్టమైన యోగా ఆసనాలను వేసి షాకిచ్చారు. ఆయన ఆరోగ్య రహస్యం ఇదా.. అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అలాగే మీకు పెళ్లి కన్నా ముందు ఏమైనా ప్రేమ కథలు ఉన్నాయా.. అని సుమ ఆయనను అడగ్గా.. అందుకు మధ్యలో సుభాషిణి కలగజేసుకుని మాట్లాడుతూ.. అవును.. పెళ్లికి ముందు కాదు కానీ.. ఇప్పుడైతే చాలానే ఉన్నాయి.. అని అంటుంది. దీంతో అందరూ బిగ్గరగా నవ్వేస్తారు.
ఇక ప్రోమో చివర్లో సుభాషిణి కంటతడి పెట్టుకుంటుంది. తాను ఈ రోజు బతికి ఉన్నానంటూ అందుకు కారణం సుమనే అని చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేకపోతే సుమ ఎంతగానో సహాయం చేసిందని.. ఆమె లేకపోతే తాను ఈ రోజు ఉండేదాన్ని కాదని చెబుతూ సుభాషిణి ఏడ్చేసింది. దీంతో సుమ కూడా ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది. ఇక తనకు సుమ ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉందని.. ఎప్పటికప్పుడు తనకు అవసరమైన మందులను పంపిస్తుందని.. సుభాషిణి తెలియజేసింది. దీంతో సుమ చేస్తున్న సహాయానికి, ఆమె గొప్ప మనసుకు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇన్ని రోజులు సుమ అంటే అల్లరి బాగా చేస్తుందని అనుకున్నాం కానీ.. ఆమెలో ఇంత మానవతా హృదయం దాగి ఉందని ఇప్పుడే అర్థమైందని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ జూలై 16వ తేదీన ప్రసారం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…