Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత తన రూటు మార్చింది. అంతకు ముందు కాస్తో కూస్తో పద్ధతిగా ఉన్న ఈమె విడాకుల అనంతరం హద్దులు చెరిపేస్తోంది. గ్లామర్ షోనే పరమావధిగా పెట్టుకుంది. అందులో భాగంగానే అవకాశం లభించినప్పుడల్లా అందాలను ఆరబోస్తోంది. మొన్నీ మధ్యే ఓ అవార్డ్స్ వేడుకలో సమంత ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసింది. దీంతో జనాలందరూ అవాక్కయ్యారు. తరువాత అడపా దడపా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తూనే ఉంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన కవర్ ఫొటోషూట్‌లో అయితే సమంత అందాలను ఏమాత్రం దాచుకోలేదు. అయితే గ్లామర్ వ్యవహారం అంతా ఒకెత్తు అయితే.. సమంత తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌తో కలిసి తిరగడం మరో ఎత్తుగా మారింది.
నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వడం వెనుక ప్రీతమ్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు కారణాన్ని కూడా చూపించారు. ప్రీతమ్, సమంతలు క్లోజ్‌గా ఉన్న ఒక ఫొటో కారణంగానే సమంత చైతూకు విడాకులు ఇచ్చిందన్నారు. అయితే ప్రీతమ్ మాత్రం సమంత తనకు అక్కలాంటిదని అన్నాడు. అయితే ఎప్పటికప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా వీరు టూర్లకు చెక్కేస్తూనే ఉన్నారు. లేదంటే షూటింగ్ లొకేషన్‌లోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే సమంత, ప్రీతమ్ లు ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. తాజాగా మరోమారు ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

సమంత, తన స్టైలిస్ట్‌లు ప్రీతమ్, సాధన సింగ్‌లతో ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. దానికి తాలూకు ఫొటోను సమంత తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు.. అది డేట్ నైట్ అని ఓపెన్‌గా చెప్పేసింది. దీంతో సమంత, ప్రీతమ్‌ల మధ్య ఉన్న రిలేషన్ గురించి మళ్లీ వార్తలు వస్తున్నాయి. సమంత అలా ఓపెన్ గా డేట్‌నైట్ అని కాప్షన్ పెట్టడం వెనుక అర్థం ఏమిటా.. అని ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా.. చైతూకు విడాకులు ఇచ్చిన తరువాత ప్రీతమ్ ఆమెకు మరింత దగ్గరయ్యాడని చెప్పవచ్చు. ఇక ఇది ఇంకా ఎన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.